చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దినకరన్ ఇంట్లో ఢిల్లీ పోలీసుల సోదాలు,భార్యను ప్రశ్నించిన పోలీసులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన దినకరన్ నివాసంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం నాడు సోదాలు నిర్వహించారు.

విచారణ నిమిత్తం ఐదు రోజుల పాటు దినకరన్ ను ఢిల్లీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొన్నారు. తొమ్మిదిమంది సభ్యుల బృందం దినకరన్ ను ప్రశ్నిస్తున్నారు.

అన్నాడీఎంకె ఎన్నికల చిహ్నం కోసం రూ.50 కోట్లను ఎన్నికల కమిషన్ ను లంచం ఇవ్వజూపారనే ఆరోపణలతో దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Delhi police searches in Dinakaran house at Chennai

అయితే ఈ కేసులు దినకరన్ కు ఒక్కడి హస్తం ఉండే అవకాశం లేదన్నారు. ఆ పార్టీకి చెందిన వారికి కూడ ఈ విషయాలు తెలిసే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అలాగే ఈ కేసులో పదికోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు సంకేతాలు ఉన్నా పట్టుబడింది మాత్రం కేవలం రూ.1.3 కోట్లు కావడంతో మిగిలిన మొత్తంపై లెక్క తేలాల్సి ఉంది.

ఈ మొత్తం ఎవరిచేతిలో ఉన్నాయో దీని వెనుకు మరెవ్వరి హస్తం అయినా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో తదుపరి ఎవరిని అరెస్టు చేస్తారనే చర్చ సాగుతోంది.

ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపారనే కేసులో దినకరన్ సతీమణి అనురాధను కూడ ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.అంతేకాదు వారు నడుపుతున్న ఛానల్ కు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయాన్ని అనురాధను ప్రశ్నించారు.ఆమె పేరు మీద ఉన్న ఆస్తుల గురించి కూడ ఆరా తీశారు.

అయితే ఇటీవల రద్దు చేసి ఆర్ కె నగర్ ఉప ఎన్నికల సందర్భంగా దినకరన్ ఎన్నికల కమిషన్ కుసమర్పించిన అఫిడవిట్ లో తన పేరున 68 లక్షల ఆస్తులున్నట్టు చూపాడు. అతని భార్య పేరున సుమారు 9.59 కోట్ల ఆస్తులున్నట్టు చూపాడు.

English summary
Delhi police searches in Dinakaran house at Chennai on Thursday. Dinakaran and his aide arrested in bribe case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X