వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవార్డులు వద్దు..30 మంది క్రీడాకారులు ర్యాలీగా.. రాష్ట్రపతిభవన్ వెళ్తుండగా అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధర కోసం అన్నదాత కదం తొక్కాడు. రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీతో కలిసి ఉన్న-హర్యానా-ఉత్తరప్రదేశ్ ఏడు సరిహద్దులను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా క్లోజ్ చేశారు. దీంతో ట్రాఫిక్ మళ్లించాల్సి రాగా.. టూ వీలర్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

మద్దతుకు సీపీఎం, సీపీఐ, సీపీఐ మార్కిస్ట్-లెనినిస్ట్, ఆర్‌ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఏఐఎఫ్‌బీ, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన మద్దతు తెలిపింది. మంగళవారం భారతీయ కిసాన్ యూనియన్ తెలిపింది. ఇదిలా ఉంటే రైతుల బంద్‌కు క్రీడాకారులు కూడా మద్దతు తెలుపుతున్నారు.

Delhi Police stop sportspersons from Punjab, Harayana marching towards Rashtrapati Bhavan

పలువురు క్రీడాకారులు రాష్ట్రపతి భవన్‌ వైపు కదం తొక్కారు. వారిలో రెజ్లర్ కర్తార్ సింగ్ కూడా ఉన్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ తమ అవార్డులను వెనక్కి ఇవ్వడానికి ర్యాలీగా బయల్దేరారు. అయితే వారిని ఢిల్లీ పోలీసులు మధ్యలోనే నిలిపివేశారు. పంజాబ్ ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 30 మంది క్రీడాకారులు వచ్చారు.

భారతీయ కిసాన్ ప్రతినిధులు మరోసారి ఆలోచించాలని కేంద్రం కోరుతోంది. వారి వెంట కొందరు నేతలు చేరి, తమ స్వార్థం కోసం ఆందోళన చేస్తున్నారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికై వారు తమ బంద్ గురించి పునరాలోచించాలని కోరారు. కానీ రైతు ప్రతినిధులు మాత్రం డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం భారత్ బంద్ కొనసాగుతోందని స్పష్టంచేశారు.

English summary
sportsperson including wrestler Kartar Singh marched towards Rashtrapati Bhavan in Delhi to return they awards as sign of protest against the farm laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X