వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: గూఢచర్యంలో పాక్ హైకమిషన్ ఉద్యోగి, ఎవరో!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కుట్రకు భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషన్‌తో లింక్ ఉందని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఈ కుట్ర రెండేళ్లుగా సాగుతోందని, ఈ కేసులో అరెస్టైన కఫైతుల్లాఖాన్‌కు పాక్ నుంచి ఆదేశాలు అందుతున్నట్లు తేలిందని చెప్పారు.

ఈ మేరకు అక్కడి ఒక ఉద్యోగి పైన అనుమానాలనున్నట్లు నేర పరిశోధన విభాగం సంయుక్త కమిషనర్ రవీంద్ర యాదవ్ సోమవారం పాత్రికేయులతో చెప్పారు. అయితే, సదరు ఉద్యోగిని గుర్తించవలసి ఉందన్నారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ అనుమతితో వారిని ప్రశ్నిస్తామన్నారు.త

ఇప్పటికే అరెస్టైన నలుగురిలో కొందరికి పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతోను సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. వీరిలో గూఢచర్య రాకెట్ కీలక నిర్వాహకుడు కఫైతుల్లా ఖాన్‌ను ప్రశ్నించారని తెలుస్తోంది. పాక్‌లోను తనలాగే పని చేసే వ్యక్తిని కలుసుకొని మరిన్ని వనరులు సమకూర్చుకనే ఏర్పాట్లలో ఉన్నట్లు అతను తెలిపారు.

Delhi Police to probe role of Pakistan High Commission employee in spying case

కఫైతుల్లా ఖాన్ భోపాల్ వెళ్లి ఉంటే అక్కడి వర్గాలు హైకమిషనర్‌లో తమ వ్యక్తి ఎవరనేది ఆయనకు చెప్పేవని పేర్కొన్నారు. అతను భోపాల్ వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు ఢిల్లీలోనే అరెస్టు చేశారు.

కాన్‌కు ప్రతి నెలా రూ.20వేలు అందేవని, కీలక సమాచారాన్ని అందజేస్తే సదరు మొత్తాన్ని భారీగా పెంచుతామంటూ ఐఎస్ఐ వర్గాల నుంచి అతనితో ఒప్పందం చేసుకున్నాయని పోలీసులు తెలిపార. ఖాన్‌కు అందిన డబ్బంతా సౌదీ అరేబియా లేదా యూఏఈల నుంచి వచ్చినట్లు వివరాలున్నాయని, అయితే ఆ డబ్బంతా పాక్ నుంచి వచ్చినట్లు ఖాతాల విశ్లేషణ ద్వారా స్పష్టమైందన్నారు.

జమ్మూలో ఖాన్‌కు సహకరించిన సన్నిహితులు, సైనిక సిబ్బంది వివరాలు, సౌదీ, యూఏఈల గుండా పాక్ నుంచి ఖాన్‌కు డబ్బు అందడం వంటి అంశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

కాగా, దేశ భద్రతా సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్టైన బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్‌ను ఢిల్లీ కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. రషీద్ నుంచి కీలక సమాచారం రాబట్టవలసి ఉందని, కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విన్నపాన్ని జడ్జి మన్నించారు.

English summary
A Pakistan High Commission employee is under the scanner of Delhi Police probing an espionage racket in which an alleged ISI operative and a serving BSF personnel have been arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X