వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ టూల్‌కిట్ ఎవరూ క్రియెట్ చేశారు, గూగుల్‌కు ఢిల్లీ పోలీసుల లేఖ, ట్వీట్, వీడియోలపై

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. అయితే సపోర్ట్ చేసే సెలబ్రిటీలపై కేంద్రం ఫోకస్ చేసింది. పర్యావరణ వేత్త గ్రేటా థన్ బెర్గ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రైతులకు అనుకూలంగా ట్వీట్ చేయడంతో సర్కార్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు ఢిల్లీపోలీసులు ఆమె మెయిల్ ఐడీ, యూఆర్ఎల్ తనిఖీ చేస్తున్నారు. ఈ మేరకు గూగుల్‌ కంపెనీకి ఢిల్లీ పోలీసులు లేఖ కూడా చేశారు. గ్రేటాతోపాటు ఇంకా ఎవరైనా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే తెలియజేయాలని కోరారు.

ప్రో ఖలిస్తాన్ టూల్ కీట్ కూడా కొందరు క్రియేట్ చేశారు. ఇదీ దేశ సాంస్కృతిక, సామాజిక అంశాలపై ప్రభావం చూపుతోందని.. ఆర్థికంగా యుద్దం ప్రకటించడమేనని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీని వెనక పీఎఫ్‌జే పాత్ర ఉందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. కెనడాలో గల వాంకొవర్‌లో పీఎఫ్‌జే సభ్యులను ఉద్దేశించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే అందులో కూడా రైతుల ఆందోళన గురించి మాట్లాడటంతో పోలీసులు ఫోకస్ చేశారు.

Delhi Police writes to Google, social media giants seeking info on creators of toolkit

వీడియో/ ట్వీట్ పోస్ట్ చేసిన వారిని పట్టుకునే పినలో నిమగ్నమయ్యాయని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అన్వేష్ రాయ్ తెలిపారు. అయితే టూల్ కిట్ మాత్రం రిపబ్లిక్ డే కన్నా ముందే వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 23వ తేదీన ట్వీట్లు వస్తే.. 26వ తేదీన కొందరు దాడి చేశారని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇదీ విచారణలో ధృవీకరించాల్సి ఉంది.

English summary
Delhi Police on Friday approached Google and other social media giants seeking more clarity about email ids, URLs and other information mentioned in the document
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X