వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delhi pollution:చావనివ్వండని వదిలేస్తారా?:ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రాష్ట్రాలకు సమన్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న రాష్ట్రాలదే ఇక్కడి కాలుష్య బాధ్యత అని తేల్చి చెప్పింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఆ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది.

 ఢిల్లీ వాయు కాలుష్యం ఎఫెక్ట్: దేశ రాజధానిని వీడాలనుకుంటున్న 40 శాతం ప్రజలు</a><a class=" title=" ఢిల్లీ వాయు కాలుష్యం ఎఫెక్ట్: దేశ రాజధానిని వీడాలనుకుంటున్న 40 శాతం ప్రజలు" /> ఢిల్లీ వాయు కాలుష్యం ఎఫెక్ట్: దేశ రాజధానిని వీడాలనుకుంటున్న 40 శాతం ప్రజలు

ఎవరు బాధ్యత వహిస్తారు?

ఎవరు బాధ్యత వహిస్తారు?

ఢిల్లీ కాలుష్యానికి, పంట వ్యర్థాల దహనానికి ఎవరు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించింది. ప్రతి ఏటా వ్యర్థాల దహనం ఎందుకు జరుగుతోందని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను, అధికారులను నిలదీశారు. ఢిల్లీలో గాలి కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రైతులకు పంట వ్యర్థాలను కాల్చే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంట వ్యర్థాల దహనానికి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ కమిషనర్లు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సప్ష్టం చేసింది.

స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితి ఏది?

స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితి ఏది?

ఢిల్లీలో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితి లేకుండా పోయిందని సుప్రీంకోర్టు మండిపడింది. జీవించే హక్కు చాలా ముఖ్యమైనదని, ఢిల్లీ నగరంలో ప్రతి గదిలోనూ గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) 500 దాటడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ఇందుకు ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పేర్కొంది.

చావనివ్వండని వదిలేస్తారా?

చావనివ్వండని వదిలేస్తారా?

అరగంటలో పర్యావరణ నిపుణులను కోర్టుకు తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల సలహాలు, సూచనలతో గాలి కాలుష్యంపై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

అంతేగాక, ప్రభుత్వం, అధికారులు తమ బాధ్యతను విస్మరించే ప్రజలను చావుకు దగ్గర చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది.

ప్రమాదకర స్థితిలో ఢిల్లీ కాలుష్యం

ప్రమాదకర స్థితిలో ఢిల్లీ కాలుష్యం

కాగా, సాధారణంగా ఏక్యూఐ 401 దాటితేనే అక్కడ గాలి కాలుష్యం దారుణంగా ఉన్నట్లు పరిగణిస్తారు.. ఢిల్లీలో అయితే ఇది 500 పాయింట్లు దాటింది. ఆదివారం అయితే ఢిల్లీలోని రోహిణి, జహంగీర్‌పుర, సోనియా విహార్ తదితర ప్రాంతాల్లో ఈ సూచీ 999ని తాకడం గమనార్హం. గాలి కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో పని ఉంటే తప్ప ప్రజలను బయటికి రావొద్దని సూచించింది ప్రభుత్వం. పాఠశాలలకు కూడా ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించారు.

English summary
The Supreme Court Monday slammed authorities for failing to curb pollution in Delhi-NCR and said they have left people to die.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X