వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైక్‌పై వచ్చి.. తుపాకీతో కాల్చి... కారు నుంచి దిగి వెళ్తుండగా ఘాతుకం...

|
Google Oneindia TeluguNews

ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తున్నారో తెలియదు కానీ .. తుపాకులతో విరుచుకుపడుతున్నారు. మెట్రో నగరాల్లో తుపాకులతో మోత మోగిస్తున్నారు. దీంతో అక్కడున్న స్థానికులు గజ గజ వణికిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఓ దుండగుడు రెచ్చిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని వచ్చిన అతడు .. చేతిలో తుపాకీతో బీభత్సం సృష్టించాడు. తాను అనుకొన్న లక్ష్యం దిశగా నడిచి టార్గెట్ చేధించాడు.

నడిరోడ్డుపై ..

నడిరోడ్డుపై ..

ఢిల్లీలోని ద్వారాకా ఓల్డ్ పరమ్ విహర్ రోడ్డు.. సమయం సాయంత్రం 4.30 గంటలు... అంతా స్థబ్తుగా ఉంది. నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. ఇంతలో ఓ ఆగంతకుడు తుపాకీ పట్టుకొని వచ్చాడు. తన ఎదురుగా ఉన్న నరేంద్ర గెహ్లాట్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. తన కారుపై కాల్పులు జరుపడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కారు దిగి పారిపోవడమే నరేంద్ర చేసిన తప్పయిపోయింది. ఆ ఆగంతకుడు మరో కారు ఎక్కి మరీ నరేంద్రను షూట్ చేశాడు.

హి ఈజ్ నో మోర్ ..

హి ఈజ్ నో మోర్ ..

వెంటనే నరేంద్రను ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. నరేంద్ర చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు నరేంద్ర ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. దీనికితోడు ఆయన ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి నరేంద్ర గెహ్లట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని వ్యాపారంలో శత్రువులు హతమార్చారా ? లేదంటే హత్య కేసుకు సంబంధించి నిందితులు సుపారీ ఇచ్చి మట్టుబెట్టారా అనే అంశంపై క్లారిటీ రాలేదు.

మరొకరి సాయం ..

మరొకరి సాయం ..

నిందితుడికి మరొకరు సాయం చేశారని పోలీసులు భావిస్తున్నారు. బైక్‌పై దింపి వెళ్లడంతో హెల్మెట్ పెట్టుకున్న ఆగంతకుడు రెచ్చిపోయాడని అనుమానిస్తున్నారు. లేదంటే అంత రద్దీగా ఉండే కాలనీకి ఒక్కరు వచ్చి .. దాడి చేయడం అంత ఈజీ కాదన్నారు. సరిగ్గా అతను బయల్దేరే సమయానికి వచ్చి కాల్పులు జరపడం అంటే మమూలు విషయం కాదన్నారు. ఇదీ ప్రొఫెషనల్స్ చేస్తారని వారు చెప్తున్నారు. నరేంద్ర హత్యకు సంబంధించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

English summary
property dealer Narendra Gehlot was shot dead by an unidentified gunman outside his office in Delhi on Tuesday. The police suspect enmity could be the reason behind the killing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X