వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణతంత్ర దినోత్సవాన్నీ వదల్లేదు: పౌరసత్వ నిరసన నినాదాల హోరు.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్న వేళ.. దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు సంబంధించిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగాయి. న్యూఢిల్లీ, కోల్‌కత, గువాహటి.. వంటి నగరాల్లో పెద్ద ఎత్తున పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఆందోళనకారులు ప్రదర్శనలను చేపట్టారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ తమ నిరసన గళాన్ని వినిపించారు.

Tirumala: గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీవారి బ్రహ్మోత్సవం, బతుకమ్మ శకటాలు..!Tirumala: గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీవారి బ్రహ్మోత్సవం, బతుకమ్మ శకటాలు..!

వందలాది మంది విద్యార్థులు..


ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి, ప్రముఖ సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్.. దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కిటకిటలాడిన షహీన్‌బాగ్..

షహీన్‌బాగ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. జాతీయ పతాకాలను చేతపట్టుకున్న విద్యార్థులతో షహీన్‌బాగ్ క్రిక్కిరిసి పోయింది. జయహో భారత్.. అంటూ వారు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. అదే రేంజ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా నినాదాలు చేశారు. వారి నినాదాలతో షహీన్‌బాగ్ ప్రాంతం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమర్ ఖలీద్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.

చలనం లేని కేంద్రం..

చలనం లేని కేంద్రం..

అనంతరం ఆయన వందలాది మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు అన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని అన్నారు. ఎడతెగకుండా ప్రతిరోజూ లక్షలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వచ్చి తమ నిరసన ప్రదర్శనలను వ్యక్తం చేస్తున్నారని, అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో ఎలాంటి చలనం లేదని విమర్శించారు.

క్యాంపస్‌లను రణరంగంగా..

క్యాంపస్‌లను రణరంగంగా..

అహింసాయుతంగా నిరసన ప్రదర్శనలను చేపడుతోన్న విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేయడం, యాజమాన్యం అనుమతి లేకుండానే విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులను పంపించడం, ప్రశాంతంగా ఉండే క్యాంపస్‌లను ఉద్దేశపూరకంగా రణరంగంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడిని తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపైనా ఉందని చెప్పారు.

English summary
A huge crowd of protesters, opposing Citizenship Amendment Act, National Register of Citizens (NRC) and National Population Register (NPR), gather at Shaheen Bagh to celebrate RepublicDay. Former JNU student and activist Umar Khalid is also present at the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X