వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ట్రాక్టర్ల ర్యాలీ: పోలీసులను విచక్షణారహితంగా కొట్టిన రైతులు, భయంతో పరుగులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారింది. శాంతియుతంగా జరుగుతుందనుకున్న నిరసనకారుల ర్యాలీ ఘర్షణలకు, ఉద్రిక్తతలకు తావిచ్చింది. పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడులు చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

కాగా, పలు చోట్ల రైతులు పోలీసులపై విచక్షణా రహితంగా దాడులు చేశారు. దీంతో పోలీసులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎర్రకోట వద్ద నిరసన కారులు కర్రలతో పోలీసులను విచక్షణారహితంగా కొట్టడంతో వారంతా గేట్లు, బారికేడ్లు దూకి పరారయ్యారు. ఎత్తైన ప్రాంతం నుంచి దూకడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు.

Delhi: Protestors attacked Police at Red Fort- scary video

ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానాలో అలర్ట్
రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లను ఇప్పటికే మూసివేశారు. పలు చోట్ల ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తొలగించారు. ఎర్రకోట ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పార్లమెంటు, విజయ్ చౌక్, రాజ్ పథ్, ఇండియా గేట్ వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు.

రైతులు అనుమతించిన మార్గాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ర్యాలీలు నిర్వహించి విధ్వంసానికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. రైతుల దాడుల్లో అనేక మంది పోలీసులు గాయాలపాయ్యారని చెప్పారు. తప్పని పరిస్థితుల్లోనే కొన్ని ప్రాంతాల్లో లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ర్యాలీ సందర్భంగా ఓ రైతు ట్రాక్టర్ బోల్తా కొట్టి చనిపోతే.. పోలీసులు కాల్చి చంపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితులపై అధికారులతో చర్చించారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అధికారులు హోంమంత్రికి వివరించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కేంద్రమంత్రి అమిత్ షా సూచించారు. అనంతరం దేశ రాజధానిలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

దేశ రాజధానిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Petrol Price Hike: Petrol crosses Rs 100 per litre in this city, check rates in your region here

English summary
Delhi: Protestors attacked Police at Red Fort- scary video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X