వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెన్మార్క్ మహిళ రేప్: ప్రజలకు దేవుడే దిక్కన్నకేజ్రీవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డెన్మార్క్ మహిళపై అత్యాచారం మీద తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్పందించారు. ఢిల్లీలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు కేజ్రీవాల్ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. డెన్మార్క్ మహిళపై అత్యాచారం తర్వాత కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. అత్యాచారాలు కేవలం ఢిల్లీలోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి స్పందించారు.

ఇలాంటి ఘటనలను ప్రజలు సహించరన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. పని చేయని అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో ఏదైనా క్రైమ్ ఘటన ఆగుతుందంటే అది పోలీసుల వల్ల కాదని, దేవుడి దయ వల్లే అన్నారు. ప్రజల భద్రతను దేవుడికి వదిలేశారన్నారు.

Arvind Kejriwal

న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి కూడా పోలీసుల తీరును తప్పు పట్టారు. తాను పోలీసులను సంప్రదించినప్పటికీ సెక్స్ అండ్ డ్రగ్ రాకెట్ అంశాలపై విచారణ చేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారన్నారు. ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఢిల్లీ పోలీసులు తనతో వాదనకు దిగారని, చర్యలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను రక్షించే పోలీసుల పైనే ఆరోపణలు వినిపిస్తున్నాయని మరో మంత్రి రాఖీ బిర్లా అన్నారు.

రెండు ఘటనలలో ఇన్వాల్వ్ అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. సారంగ్ పూర్, మాల్వియా నగర్ ఎస్‌హెచ్‌వోలను సస్పెండ్ చేయాలని అన్నారు. వారు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. మంత్రులు తమ విధుల్లో కల్పించుకుంటారని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. కాగా, నిర్భయ ఘటన జరిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నాటి షీలా దీక్షిత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించడం గమనార్హం.

English summary
Chief Minister Arvind Kejriwal blamed the Delhi Police for the rising crimes against women in the state. Addressing media persons, the AAP leader accused the police of being "a highly compromised force."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X