వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తినలో మంకీ పాక్స్ కలకలం.. ఐదో కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

దేశంలో మంకీ పాక్స్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దేశ రాజధానిలో ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది. అయితే ఈ సారి ట్రావెల్ హిస్టరీతోనే బయటపడింది. కొద్దీరోజుల కింద ఆఫ్రికాలోని నైజీరియా నుంచి వచ్చిన 22 ఏళ్ల యువతికి ఆరోగ్యం బాగోలేదట. చర్మంపై దద్దుర్లు రావడంతో ఆసుపత్రిలో చేరింది. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించిన వైద్యులు.. ఆమెకు సోకింది మంకీ పాక్స్ వైరస్ అని నిర్ధారించారు.

 Delhi reports 5th monkeypox case

సదరు యువతి నైజీరియా దేశానికి చెందినవారేనని.. ఆమె అక్కడి నుంచి వచ్చే ముందే మంకీ పాక్స్ సోకి ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు రోజుల కిందట ఢిల్లీలోని ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చేరిందని, తగిన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఈ పాజిటివ్ వచ్చిన నైజీరియా యువతితో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఒకరు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారని.. మిగతా నలుగురు ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

Recommended Video

Monkeypox: మంకీపాక్స్ వేగం పెరుగుతోందన్న డబ్ల్యూహెచ్ఓ | Telugu Oneindia

ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశం ఉంది. ఇది అరుదైన వ్యాధి, మశూచికి దారితీసే వైరస్ వంటి ఇతర పాక్స్ వైరస్ల మాదిరిగానే ఉంటుంది. మంకీపాక్స్ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా సోకే అవకాశం ఉంది. గాయం, శారీరక సంపర్కం వల్ల కూడా వ్యాపిస్తుందట. మనషులకు అయితే.. ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకరు మంకీపాక్స్‌కు గురైన సమయంలో వెంటనే లక్షణాలను చూపించదు. వైరస్ కోసం పొదిగే కాలం ఏడు నుండి 21 రోజుల మధ్య ఉంటుందట. అలాగే మంకీ పాక్స్ వచ్చిన వారికి జ్వరం,
తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, చలి, అలసట ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేశారు.

English summary
Delhi on Saturday reported its fifth monkeypox patient after a woman admitted to Lok Nayak Jai Prakash Narayan hospital tested positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X