వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు: జేఎన్‌యూ పీహెచ్‌డీ స్కాలర్ షార్జిల్ ఇమామ్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ఈ అల్లర్లకు సంబంధం ఉన్న జేఎన్‌యూ పీహెచ్‌డీ స్కాలర్ షార్జిల్ ఇమామ్‌ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం సోమవారం అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రొడక్షన్ వారెంట్ మీద ఇతడ్ని అస్సాం నుంచి ఢిల్లీకి తిరిగి తీసుకొచ్చారు.

దేశ సౌర్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగించే జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన షార్జిల్ ఇమామ్ పై ఏప్రిల్ నెలలోనే ఢిల్లీ పోలీసులు ఛార్జీషీటు నమోదు చేశారు. ఇమామ్.. దేశ రాజ్యాంగాన్ని బహిరంగంగా ధిక్కరించడంతోపాటు రాజ్యాంగాన్ని ఓ ఫాసిస్ట్ పత్రం అని పేర్కొన్నాడని ఛార్జీషీటులో పోలీసులు పేర్కొన్నారు.

 Delhi riots: JNU PhD scholar Sharjeel Imam now arrested

గత ఏడాది సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ఇమామ్.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. దీంతో అతడ్ని గౌహతి జైల్లో పెట్టారు. కాగా, ఇతడు జులై 21న కరోనా బారినపడ్డాడు. ఇంతకుముందు జనవరి 28న బీహార్ రాష్ట్రంలోని జహనాబాద్‌లో ఢిల్లీ పోలీసులు షార్జిల్ ఇమామ్‌ను అరెస్ట్ చేశారు. దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు జాతి వ్యతిరేక ప్రసంగాలు చేసిన నేపథ్యంలో అతనిపై పలు కేసులు నమోదు చేశారు.

ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా షార్జిల్ ఇమామ్‌పై దేశ ద్రోహం కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 13, 15 తేదీల్లో జరిగిన జామియా అల్లర్లలోనూ విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన ఇతడ్ని అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
The Special Cell of Delhi Police Tuesday arrested JNU PhD scholar Sharjeel Imam in connection with Northeast Delhi riots in February this year under the stringent Unlawful Activities Prevention Act (UAPA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X