Delhi riots: ఢిల్లీ అల్లర్లకు సింగపూర్, సౌదీ లో స్కెచ్, కాంగ్రెస్ లీడర్ చేతివాటం, జాకీర్ నాయక్ !
న్యూఢిల్లీ/ ముంబై: దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ అల్లర్లకు విదేశాల్లో స్కెచ్ వేశారని, ఇస్తాం మతబోధకుడు జాకీర్ నాయక్ ను కలిసి పక్కాప్లాన్ వేశారని ఢిల్లీ పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఢిల్లీ అల్లర్లకు కారణం అయిన నిందితులు సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియాల్లో సమావేశాలు నిర్వహించారని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూశాయి. సింగపూర్, సౌదీల్లో ఎంత మంది కలిశారు? వారు ఎక్కడెక్కడ ఉన్నారు అనే పూర్తి సమాచారం సేకరిస్తున్నామని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ సినిమాలు వేస్ట్, రక్తచరిత్ర స్టైల్లో జైల్లో వికాస్ దూబే స్కెచ్ లు, బంధువులు ఫినిష్

కాంగ్రెస్ లీడర్ చేతివాటం
ఢిల్లీ అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మునిసిపల్ మాజీ కౌన్సిలర్ ఇష్రత్ జహాన్ ను గత మార్చి నెలలో ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మార్గంలో ఇష్రత్ జహాన్ మహారాష్ట్రలోని ఘాజియాబాద్ లోని బంధువులు, వారి సన్నిహితుల నుంచి అక్రమంగా నిధులు సేకరించి ఢిల్లీలో అల్లర్లు సృష్టించారని, గొడవల కోసం ఆ డబ్బులు ఖర్చు చేశారని ఢిల్లీ పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

సింగపూర్ ఎన్ఆర్ఐతో డీల్
ఢిల్లీ అల్లర్లకు కారణం అయిన ఖలీద్ సైఫీకి, కాంగ్రెస్ లీడర్ ఇష్రత్ జహాన్ లు అనేకసార్లు కలిశారని పోలీసు అధికారులు అంటున్నారు. సింగపూర్ కు చెందిన ఓ ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి ఖలీద్ సైఫీ అకౌంట్ కు అక్రమంగా భారీ మొత్తంలో నిధులు బదిలి అయ్యాయని ఢిల్లీ ప్రత్యేక పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

అక్రమంగా NGO సంస్థకు నగదు బదిలి
సింగపూర్ లోని ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి భారత్ లోని ఖలీద్ సైఫీ అకౌంట్ కు నగదు బదిలి అయిన తరువాత NGO సంస్థ ముసుగులో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఊమర్ ఖలీద్ కు, మీరట్ లోని అతని వ్యాపార భాగస్వామికి ఆడబ్బులు బదిలీ అయ్యాయని ఢిల్లీ అల్లర్ల కేసు విచాణ చేస్తున్న ప్రత్యేక విభాగం పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో సింగపూర్ లోని ఆ ఎన్ఆర్ఐ పూర్తి సమాచారం సేకరిస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

మలేషియాలో జాకీర్ నాయక్ తో డీల్
పోలీసుల అదుపులో ఉన్న ఖలీద్ సైఫీ మొబైల్ డేటాను పూర్తిగా పరిశీలిస్తే అతను విదేశాల నుంచి ఎంత మొత్తంలో నిధులు సేకరించాడు ?, ఎవరెవరు నిధులు ఇచ్చారు ?, ఢిల్లీ అల్లర్లకు కారణం అయిన వారికి ఎంత మొత్తంలో ఇచ్చాడు అని సమాచారం తెలుస్తోందని, ఆ కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మలేషియాలో ఇస్లాం మతబోధకుడు జాకీర్ నాయక్, ఊమర్ ఖలీద్, తాహీర్ హుస్సేన్ తో పాటు చాల మందిని కలవడానికి ఖలీద్ సైఫీ విదేశాలకు వెళ్లి వచ్చాడని, అతని పాస్ పోర్టు సీజ్ చేసి మొత్తం వివరాలు పరీశీలిస్తే బండారం మొత్తం బయటపడుతుందని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

కరోనా, లాక్ డౌన్ తో ఆలస్యం
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఖలీద్ సైఫీ, కాంగ్రెస్ లీడర్ ఇష్రత్ జహాన్ లను విచారణ చేసే పని వాయిదా పడుతూ వస్తోందని, ఢిల్లీ అల్లర్లకు కారణం అయిన ప్రతి ఒక్కరి భరతం పడతామని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసు అధికారులు ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియా టుడేకి చెప్పారు. మొత్తం మీద ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లకు విదేశాల్లో స్కెచ్ వేశారని, ఎన్ఆర్ఐలు, ఇస్లాం మతబోధకుడు జాకీర్ నాయక్ వీరికి సహకరించారని ఢిల్లీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.