వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delhi riots: కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి రూ. కోటి సాయం, భార్యకు ఉద్యోగం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థి సాయాన్ని ప్రకటించింది. కోటి రూపాయలతోపాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రతన్ లాల్‌ను కేంద్రం అమరవీడిగా ప్రకటించింది.

delhi clashes: ఆదేశాల కోసం చూడొద్దు, విధులు నిర్వర్తించడమే ఫస్ట్ ప్రయారిటీ, ఢిల్లీ అల్లర్లపై HCdelhi clashes: ఆదేశాల కోసం చూడొద్దు, విధులు నిర్వర్తించడమే ఫస్ట్ ప్రయారిటీ, ఢిల్లీ అల్లర్లపై HC

బుల్లెట్ గాయంతోనే రతన్ మృతి..

బుల్లెట్ గాయంతోనే రతన్ మృతి..


ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో సోమవారం సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న రతన్ లాల్ విధులు నిర్వహిస్తున్న ఆందోళనకారులు జరిపిన దాడిలో మృతి చెందారు. బుల్లెట్ గాయం వల్లే రతన్ లాల్ చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలడం గమనార్హం.

అమరవీరుడిగా..

అమరవీరుడిగా..

ఈ నేపథ్యంలోనే రతన్ లాల్‌ను అమరవీరుడిగా ప్రకటించాలంటూ ఆయన కుటుంబసభ్యులు మంగళవారం డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతోపాటు ఆతని భార్యకు ప్రభుత్వం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అరవింద్ కేజ్రీవాల్ సర్కారు కూడా సాయంతోపాటు ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.

అమిత్ షా దిగ్భ్రాంతి..

అమిత్ షా దిగ్భ్రాంతి..

కాగా, రతన్ లాల్ తోపాటు ఢిల్లీలో 22 మందికిపైగా అల్లర్లలో మృతి చెందడం పట్ల అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. రతన్ లాల్ ధైర్యశాలి, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ధీరోదత్తుడు అమిత్ షా కొనియాడారు. దేశ సేవలో తన ప్రాణాలనే అర్పించిన వీర సైనికుడు అని అమిత్ షా

Recommended Video

3 Minutes 10 Headlines | GISAT-1 Launch | North-East Delhi | Oneindia Telugu
వీర సైనికుడంటూ కీర్తించిన అమిత్ షా..

వీర సైనికుడంటూ కీర్తించిన అమిత్ షా..

అమరవీరుడి ఆత్మకు శాంతిని చేకూరాలని కోరుతూ రతన్‌లాల్‌ భార్యకు లేఖ రాశారు. ‘రతన్‌లాల్‌ ధైర్యశాలి, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ధీరోదాత్తుడు. దేశ సేవలో తన ప్రాణాలనే అర్పించిన వీర సైనికుడు' అని ఆయన లేఖలో పేర్కొన్నారు. పాకిస్థాన్ విమానాన్ని కూల్చిన వింగ్ కమాండర్‌ అభినందన్ వర్తమాన్‌లా ఉండే రతన్ లాల్.. ఎక్కువగా రిస్క్ ఉన్న ప్రాంతాల్లోనే విధులు నిర్వహించేవారని, శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో ఆయన ఎప్పుడు వెనుకడుగు వేయలేదని ఆయన సహ పోలీసులు చెబుతుండటం గమనార్హం. కాగా, ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది.

English summary
Delhi riots: Martyred cop Ratan Lal’s family to get Rs 1 crore compensation; wife offered govt job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X