వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delhi riots:హైకోర్టుకు కింది కోర్టు షాక్ -విద్యార్థి నేతల విడుదలపై కొర్రీ -షూరిటీల ఎంక్వైరీ సాకుతో..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా గతేడాది ఢిల్లీలో జరిగిన నిరసనలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సెషన్స్ కోర్టు విభేదించింది. వివాదాస్పద ఉపా చట్టాన్ని విద్యార్థులపై ప్రయోగించడాన్ని తప్పు పడుతూ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. కింది కోర్టు మాత్రం విద్యార్థి నేతల విడుదలపై కొర్రీలు వేసింది. వివరాలివి..

Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్

రాజ్యాంగం కల్పించిన 'నిరసన తెలిపే హక్కుకు', ఉగ్రవాద చర్యకు మధ్య తేడా ఉన్నదని వ్యాఖ్యానిస్తూ.. సీఏఏ నిరసనల్లో అరెస్టయిన ముగ్గురు విద్యార్థి నేతలు నటాషా నర్వాల్‌, దేవాంగన కలితా (జేఎన్‌యూ), అసిఫ్‌ ఇక్బాల్‌ తన్హా (జామియా మిలియా ఇస్లామియా) లకు ఢిల్లీ హైకోర్టు కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేయడం తెలిసిందే. ఆ తీర్పునకు అనుగుణంగా తమను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆ ముగ్గురూ బుధవారమే సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. కాగా,

 Delhi riots: Sessions Court defers hc order on release of student activists Natasha, Devangana, Tanha

హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, నిందితులకు ష్యూరిటీలు పెట్టే వ్యక్తుల చిరునామాలు, ఇతర వివరాలను సేకరించడానికి కొంత సమయం పడుతుందని ఢిల్లీ పోలీసులు సెషన్స్ కోర్టుకు తెలిపారు. దీంతో సెషన్స్ కోర్టు జడ్జి రవీంద్ర బేడీ.. విద్యార్థి నేతల విడుదలను తాత్కాలికంగా నిలిపేశారు. పోలీసుల నుంచి వచ్చే వివరణను బట్టి గురువారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని జడ్జి పేర్కొన్నారు.

instagram bug: ప్రమాదాన్ని గుర్తించిన 21ఏళ్ల హ్యాకర్ మయూర్‌ -వెంటనే రూ. 22లక్షలిచ్చిన Facebook instagram bug: ప్రమాదాన్ని గుర్తించిన 21ఏళ్ల హ్యాకర్ మయూర్‌ -వెంటనే రూ. 22లక్షలిచ్చిన Facebook

Recommended Video

'Namaste Trump' : Ahmedabad’s Motera Stadium Getting Ready To Host Trump

నటాషా, దేవాంగన, ఆసిఫ్ ఇక్బాల్ కు బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ''అసమ్మతిని అణచివేయాలనే ఆరాటంలో కేంద్రానికి.. రాజ్యాంగం హామీ ఇచ్చిన నిరసన తెలిపే హక్కుకూ, ఉగ్రవాద చర్యకు మధ్య ఉన్న తేడా మసకబారినట్టు అనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం. సాధారణంగా ఐపీసీ కిందకు వచ్చే నేరాలకు ఉగ్రవాద చర్య పేరుతో యూఏపీఏ చట్టాన్ని వర్తింపజేయరాదు. అతిశయోక్తి ప్రసంగాలు మినహా నిందితులపై మోపిన అభియోగాలు ఏవీ యూఏపీఏ కిందకు రావు'' అని జడ్జిలు పేర్కొన్నారు.

English summary
A court here on Wednesday deferred its order on the immediate release of JNU students Devangana Kalita and Natasha Narwal, who have been granted bail by the high court in the riots ''conspiracy'' case, for Thursday. “Order could not be passed due to the heavy board of bail applications listed before the undersigned. Be put up for orders tomorrow at 11 am,” Additional Sessions Judge Revinder Bedi stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X