వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా జడ్జీ వెంటపడిన దొంగలు.. అదును చూసి..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తినే వెంబడించారు. ఆమె కారు అద్దాలు పగలగొట్టి ఆమె పర్సు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: బాలీవుడ్ స్టార్స్, మాజీ సీఎం, గవర్నర్‌, టాప్ పొలిటీషన్స్ విటులే!హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: బాలీవుడ్ స్టార్స్, మాజీ సీఎం, గవర్నర్‌, టాప్ పొలిటీషన్స్ విటులే!

ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సాకేత్ కోర్టు అదనపు న్యాయమూర్తి గత మంగళవారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు.

Delhi Robbers Chase Woman Judge for 3 km, Lack of Police Presence

అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆమె కారును వెంబడించారు. సరితా విహార్ అండర్ పాస్‌ సమీపంలోకి రాగానే.. కారు వెనుక భాగం విరిగిపోయిందని ఆ దుండగులు ఆమెకు సైగలు చేశారు. అయితే, ఆమె వారి మాటలు నమ్మకుండా డ్రైవింగ్ కొనసాగించారు.

ఓఖ్లా ప్రాంతంలో ఆమె కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగానే.. వెనుకే వస్తున్న దొంగలు ఆమె కారు అద్దాలు పగలగొట్టి.. ఆమె పర్స్ ఎత్తుకెళ్లారు. ఈ పరిణామంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి.. కళ్లముందే చోరీ జరుగుతున్నా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు.

పగడీ ధరించిన తొలి సిక్కు పోలీస్ అధికారి కాల్చివేత: కన్నీటిసంద్రంలో హూస్టన్పగడీ ధరించిన తొలి సిక్కు పోలీస్ అధికారి కాల్చివేత: కన్నీటిసంద్రంలో హూస్టన్

ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా, దేశ రాజధానిలో ఓ మహిళా న్యాయమూర్తి పరిస్థితే ఇలావుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.

English summary
A woman judge was on Friday robbed of her bag by two motorcycle-borne men who followed her car nearly three km from the court and struck at the first opportunity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X