వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ ఎమ్మెల్యేపై ఇంకుతో దాడి -యూపీ సందర్శకు వెళ్లిన ఢిల్లీ నేతకు చేదు అనుభవం -అరెస్టుస్కూళ్ల నిర్వహణ, విద్యా ప్

|
Google Oneindia TeluguNews

స్కూళ్ల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాల విషయంలో మేమంటే మేమే బెస్టంటూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధినేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఎమ్మెల్యే సోమనాధ్ భారతికి పొరుగురాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది.

వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్

యూపీలోని రాయ్‌బరేలీలో గల ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు వెళ్లిన సోమనాథ్ భారతిపై కొందరు యువకులు ఇంకు చల్లారు. ఆప్ ఎమ్మెల్యే యూపీ పర్యటన ఉద్రిక్తతకు దారితీయడంతో ఆయను వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు కోరగా.. తీవ్ర వాగ్వాదం చెలరేగింది. గొడవ జరుగుతుండగానే ఎమ్మెల్యేపై దుండగులు ఇంకు విసిరారు.

 Delhis AAP MLA Somnath Bharti Faces Ink Attack in Uttar Pradesh

స్కూళ్లు, ఆస్పత్రులపై సవాళ్లను నిరూపించేందుకు ఆదివారమే యూపీకి వచ్చిన ఢిల్లీ ఎమ్మెల్యేను గెస్ట్ హౌజ్ నుంచి బయటికి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇందకు దాడి తర్వాత ఆప్ ఎమ్మెల్యేను అమేథికి తరలించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆస్పత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.

యూపీలో విద్యా, ఆరోగ్య సదుపాయాలపై ప్రశ్నిస్తున్న ఆమాద్మీ నేతలపై దాడులకు ఉసిగొల్పడం యూపీ ప్రభుత్వం నియంతృత్వం వైఖరికి నిదర్శనమని ఆమాద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. సోమనాథ్ భారతిపై జరిగిన ఇంకుదాడి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.

కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?

ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై యూపీలో ఇంకుదాడి జరగడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. యూపీ స్కూళ్లను చూడ్డానికి వస్తే సీఎం యోగి ఎందుకు ''భయపడుతున్నారంటూ'' ఆయన దుయ్యబట్టారు.

English summary
Ink was thrown on Aam Aadmi Party (AAP) MLA Somnath Bharti on Monday, allegedly by a right-wing activist during his visit to Uttar Pradesh. The incident took place in Amethi where he had previously made a controversial comment regarding the condition of hospitals in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X