వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కరోనా విలయ తాండవం.. 10 శాతానికి చేరువలో పాజిటివిటీ రేటు

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఫోర్త్ వేవ్‌లో కూడా భారీగా కేసులు అవుతూ ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 1652 కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 9.92 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు పెరగడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు.24 గంటల్లో 1702 మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6809కి చేరింది. కరోనా వైరస్ సోకిన 8 మంది చనిపోయారు.

 Delhis Covid positivity rate almost halves to 10%

కరోనా కేసులు పెరుగుతున్నందున ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుంది. ఆస్పత్రులలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గత 12 రోజుల నుంచి 2 వేల లోపు కేసులు వస్తున్నాయి. అలాగే బూస్టర్ డోసు వేసుకోవాలని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఒకటి, రెండు డోసు కన్నా బూస్టర్ డోసు చక్కగా పనిచేస్తుందని చెప్పారు.

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కరోనా కేసులు వంద శాతం పెరిగాయి. శనివారం నుంచి రోజుకు ఐదుగురు.. కరోనా బారినపడి సమస్యలతో చనిపోతున్నారు. ఢిల్లీలో గత 15 రోజుల్లో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య రెండు రెట్లు పెరిగింది.

1వ తేదీ నుంచి ఆస్పత్రిలో చేరిన వారి వివరాలను పరిశీలిస్తే.. 307 నుంచి 588కి పెరిగాయి. 205 మంది ఆక్సిజన్ సపోర్ట్ తీసుకున్నారు. 22 మంది వెంటిలేటర్ సపోర్ట్‌తో ఉన్నారు. ఐసీయూలో చేరిన వారి సంఖ్య 98 నుంచి 16వ తేదీ వరకు 202కి చేరింది. ఇటు ముంబైలో కూడా క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. 14వ తేదీ వరకు 882 కేసులు చేరుకున్నాయి.

English summary
Delhi on Wednesday reported a stark fall in the positivity rate. With 1,652 fresh coronavirus infections in the national capital in the last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X