వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠశాల నిర్మాణాల్లో అవినీతి.. కేజ్రీవాల్, సిసోడియా రాజీనామాకు బీజేపీ పట్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రికార్డు మెజార్టీతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ .. ఢిల్లీ అసెంబ్లీపై కూడా కన్నేసింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా అవినీతి ఆరోపణలు చేసి .. కేజ్రీవాల్ సర్కార్‌కు అవినీతి మకిలీ ఉందనే చర్చకు దారితీసింది. పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని .. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

రూ.2 వేల కోట్ల అవినీతి ..
ఢిల్లీలో చేపట్టిన పాఠశాల నిర్మాణంలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని గుర్తుచేసింది. తక్కువలో వ్యయమయ్యే నిర్మాణానికి ఎక్కువ మొత్తం టెండర్లు వేశారని పేర్కొన్నది. అయితే ఈ కాంట్రాక్టులో సింహాభాగం దక్కింది మనీశ్ సిసోడియా బంధువులకేనని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఆరోపించారు.

delhi school buliding construction are corruption ..!

రాజీనామాకు డిమాండ్
తరగతి గదుల నిర్మాణం కోసం చదరపు అడుగుకి రూ.8800 చెల్లించారని గుర్తుచేశారు. అయితే దీనికంటే ఫ్లాట్లే తక్కువ ఖరీదుకు వస్తాయని తెలిపారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో రియల్ ఎస్టేట్ ఖరీదు కూడా చదరపు అడుగుకు రూ.5 వేలకు మించదని గుర్తుచేశారు. అని కేజ్రీవాల్, సిసోడియా అవినీతి పీక్ స్టేజీకి చేరిపోయిందన్నారు. పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి లోక్‌పాల్‌లో అప్పీల్ చేస్తామనన్నారు. అవినీతికి బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్, సిసోడియా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary
The BJP has alleged that over Rs 2 crore of corruption has been committed in the construction of a school in Delhi. CM Arvind Kejriwal and Deputy CM Manish Sisodia recalled that was corrupt. It has been stated that a large amount of tenders have been laid for low cost construction. Delhi BJP chief Manoj Tiwari alleged that Manish Sisodia's relatives were the share of the deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X