వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు ఢిల్లీ కూడా.. 18వ తేదీ నుంచి మోగనున్న బడి గంట.. వీరికే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. స్కూల్స్/ కాలేజీ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇవ్వగా ఈసారి ఢిల్లీ వంతు వచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి బడి గంట మోగనుంది. 10, 12 తరగతులకు క్లాసులు జరుగుతాయని ఆప్ సర్కార్ వెల్లడించింది. అయితే స్కూల్/ కాలేజీలో కొవిడ్ మార్గదర్శకాలు మాత్రం కంపల్సరీ అని స్పష్టంచేసింది.

కరోనా వల్ల గత మార్చి నుంచి ఢిల్లీలో స్కూల్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. 10 నెలల తర్వాత తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. బోర్డ్ ఎగ్జామ్స్ కోసం పిల్లలను సన్నద్దం చేయడానికి మంచి అవకాశం అని ప్రభుత్వం చెబుతోంది. జూన్ నుంచి ఇప్పటివరకు ఆన్ లైన్ క్లాసులు నడిచిన సంగతి తెలిసిందే. 10, 12 తరగతులకు నేరుగా క్లాసులు చెప్పాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల వల్ల సందేహాలు వస్తున్నాయని వారు చెబుతున్నారు.

Delhi schools to reopen from January 18 for classes 10 and 12..

అయితే స్కూల్ వచ్చే సమయంలో విధిగా మాస్క్ ధరించాలని.. శానిటైజర్ తీసుకురావాలని స్పష్టంచేశారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత స్కూల్స్ ప్రారంభిస్తామని ఇదివరకు విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా స్పస్టంచేసిన సంగతి తెలిసిందే.

English summary
government of Delhi has decided to reopen the schools in the national capital from January 18 for students of classes 10 and 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X