వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ సరిహద్దులకు తాళం: సీఎం కీలక నిర్ణయం, వారంపాటు అంతే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారంపాటు ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్ మార్గాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్: ఆ భవనం మూసివేతఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్: ఆ భవనం మూసివేత

వారంపాటు అంతే..

వారంపాటు అంతే..

అయితే, నిత్యావసర వాహనాలతోపాటు అనుమతి పాస్‌‌లు ఉన్నవారు యథావిధిగా ప్రయాణం కొనసాగించవచ్చని కేజ్రీవాల్ తెలిపారు. వచ్చే వారం మళ్లీ ఈ సరిహద్దులను తెరవాలా? వద్దా? అనేదానిపై శుక్రవారం వరకు ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కోరారు. ఇందుకోసం వాట్సాప్ నెంబర్ 8800007722కు సందేశాలు పంపొచ్చని, దీంతోపాటు [email protected]కు ఈమెయిల్ చేయవచ్చని తెలిపారు.

సరిహద్దుల మూసివేత అందుకే..

సరిహద్దుల మూసివేత అందుకే..

అంతేగాక, టోల్ ఫ్రీ నెంబర్ 1031కి కూడా శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు కాల్ చేసి సలహాలు, సూచనలు చేయొచ్చని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకే సరిహద్దుల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలను ఢిల్లీకి అనుమతిస్తే అలాంటివారే ఇక్కడ అధికంగా వైద్య సేవలు పొందుతారని, దీంతో స్థానికులకు నష్టం కలుగుతుందని వివరించారు.

కేంద్రం సడలింపులే ఢిల్లీలో..

కేంద్రం సడలింపులే ఢిల్లీలో..


ఢిల్లీ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు సరిపడా వసతులున్నాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అన్ని సడలింపులను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సెలూన్లు, దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నామని, వాటి నిర్వహణపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు.

Recommended Video

AP CM Jagan Will Meet Modi & Amit Shah On Tuesday To Discuss Key Issues
ఢిల్లీలో 20వేలకు చేరువలో కరోనా కేసులు..

ఢిల్లీలో 20వేలకు చేరువలో కరోనా కేసులు..


కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 19,844 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,893 యాక్టివ్ కేసులున్నాయి. 12,757 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 473 కరోనాతో మరణించారు. ఢిల్లీలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం కేజ్రీవాల్ సరిహద్దు మూసివేత నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలావుంటే, ఢిల్లీ-నోయిడా సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా అధికారులు ఆదివారమే ప్రకటించారు. జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత 20 రోజులుగా అక్కడ నమోదైన కేసుల్లో 42 శాతం ఢిల్లీతో సంబంధం ఉన్నవేనని చెప్పారు.

English summary
Delhi Seals Borders For one Week, Only Essential Services Allowed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X