వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీ మంత్రి రాసలీల కేసు : 'రేషన్ కార్డు ఇప్పిస్తానని లోబర్చుకున్నాడు'
న్యూఢిల్లీ : ఢిల్లీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన సస్పెండెడ్ మంత్రి సందీప్ కుమార్.. సెక్స్ సీడీల వ్యవహారం మరో మలుపు తీసుకుంది. తాజాగా ఆ సీడీల్లో ఉన్న మహిళ ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయింది.

మంత్రి రాసలీల సీడీలో తను ఉండడంపై వివరణ ఇచ్చిన సదరు మహిళ.. తనను సందీప్ కుమార్ ఎలా లోబరుచుకున్నాడన్న విషయాన్ని పోలీసులకు వెల్లడించింది. ఆధార్ కార్డు ఇప్పిస్తానని ఇంటికి పిలిపించుకున్న మంత్రి సందీప్ కుమార్.. తనకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడని, అనంతరం తనను లోబర్చుకున్నట్లుగా సదరు మహిళ వెల్లడించింది.