వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిటెక్కిన ఢిల్లీ.. ఎన్నికల తాయిలాలకు అంతా రెఢీ

|
Google Oneindia TeluguNews

మరో రెండు మూడు నెలల్లో ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతుంది. దీంతో ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజారంజక పథకాలను ఇప్పటి నుండే అమల్లోకి తీసుకువస్తుండగా అందుకు పోటీగా బీజేపీ సైతం పావులు కదుపుతోంది.

ఎన్నికలను ఎదుర్కోనేందుకు ముఖ్యమంత్రి ఇదివరకే పలు పథకాలను కేజ్రీవాల్ ప్రకటించారు. ఇందులో భాగంగానే 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడకం దారులకు ఉచిత విద్యుత్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న నీటీ బిల్లులను కూడ ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు ఢిల్లీ మహిళలకు మెట్రోతోపాటు బస్సుల్లో కూడ ఉచిత ప్రయాణాన్ని అందించనున్నట్టు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పై కేంద్రం నుండి ఎలాంటీ నిర్ణయం రాకపోవడంతో కేజ్రీవాల్ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం పక్కన బెట్టారు.

Delhi Unauthorised Colonies Get Ownership Rights

దీంతో ఈ నేపథ్యంలోనే కేంద్రకేబినెట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశరాజధాని ఢిల్లీలో అక్రమంగా కాలనీలు, ఇళ్లను నిర్మించుకున్న సుమారు 1800 కాలనీల్లో నివసిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రప్రభుత్వ నిర్ణయంతో ఢిల్లీలో నివసిస్తున్న సుమారు నలబై లక్షల మంది నివాసితులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దగ్గరయ్యోందుకు పలు పథకాలు, తాయిలాలు ప్రకటిస్తున్నాయి. దీంతో అప్పుడు ఎన్నికల వాతవరణ ఎర్పడింది.

English summary
Around 40 lakh people living in unauthorised colonies in Delhi will be given ownership rights, the government said today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X