వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరస్టైన ఏడాది తర్వాత ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌కు బెయిల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్. సాయిబాబాకు తాత్కాలిక ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటోన్నఆయనకు బాంబే హైకోర్టు మూడు నెలలు పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో గతేడాది 2014, మేలో ఢిల్లీలో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా నుంచి పరారైన మావోయిస్టు బృందంతో ప్రొఫెసర్ సాయిబాబాకు లింకులున్నాయని పోలీసులు ప్రధార ఆరోపణ.

Delhi University Professor Arrested for Maoist Links Granted Bail

కానీ ఆ ఆరోపణలను అప్పట్లో ప్రొఫెసర్ సాయిబాబా ఖండించారు కూడా. అయితే పోలీసులు జరిపిన తనిఖీల్లో ఆయన కంప్యూటర్‌లో దొరికిన సాక్ష్యంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ కంప్యూటర్‌లో ప్రొఫెసర్‌కు సీపీఐ మావోయిస్టులతో సంబంధం ఉన్న స్ట్రాటజీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.

సాయిబాబా అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజారు చేసింది. అదే సమయంలో సాయిబాబా నివాసం వద్ద తగిన రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.

English summary
Delhi University professor GN Saibaba, arrested a year ago by the Maharashtra police for alleged links with Maoists, has been granted temporary bail of three months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X