• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Delhi unlock: చెప్పింది చేసి చూపిస్తోన్న కేజ్రీ: తాళం తెరవడానికి ముహూర్తం ఫిక్స్

|

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌కు పుల్‌స్టాప్ పడింది. ఊహంచినట్టే.. అన్‌లాక్ ప్రక్రియను చేపట్టనుంది ఢిల్లీ ప్రభుత్వం. అన్‌లాక్‌ ప్రక్రియను ఆరంభించనుంది. దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీనికోసం ముహూర్తం కూడా పెట్టేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌లోకి వెళ్లడం..మళ్లీ అన్‌లాక్‌ను చేపట్టిన తొలి రాష్ట్రంగా ఢిల్లీ గుర్తింపు పొందింది. సోమవారం నుంచి అంటే ఈ నెల 31వ తేదీన తెల్లవారు జామున 5 గంటల నుంచి అన్‌లాక్ ప్రారంభమౌతుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

DRDO 2DG drug: మరీ అంత రేటా: శాచెట్ ధరను నిర్ధారించిన డాక్టర్ రెడ్డీస్: డిస్కౌంట్ కూడాDRDO 2DG drug: మరీ అంత రేటా: శాచెట్ ధరను నిర్ధారించిన డాక్టర్ రెడ్డీస్: డిస్కౌంట్ కూడా

 లాక్‌డౌన్‌లో నెలరోజులకు పైగా..

లాక్‌డౌన్‌లో నెలరోజులకు పైగా..

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. కిందటి నెల 20వ తేదీన అక్కడ లాక్‌డౌన్ ప్రారంభమైంది. తొలివిడతలో వారం రోజుల పాటు మాత్రమే లాక్‌డౌన్ ఉంటుందని అప్పట్లో కేజ్రీవాల్ ప్రకటించారు. రోజువారీ కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గకపోవడంతో దాన్ని పొడిగించారు. ఆరుసార్లు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఆయన ప్రయత్నం వృధా కాలేదు. సత్ఫలితాలనిచ్చింది. లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చిన మూడోవారం నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వచ్చింది. 35 శాతం మేర నమోదైన ఢిల్లీ కరోనా వైరస్ పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది.

 1.5 శాతానికి

1.5 శాతానికి

శుక్రవారం నాటికి అక్కడ నమోదైన కేసులు 1100 వరకే. పాజిటివిటీ రేటు కూడా 1.5 శాతంగా నమోదైంది. సంపూర్ణ లాక్‌డౌన్ విధించక ముందు 25 నుంచి 30 వేల వరకు రోజువారీ కొత్త కేసులు నమోదయ్యేవి. తాజాగా ఆ సంఖ్య వెయ్యికి క్షీణించింది. దీనితో దశలవారీగా అన్‌లాక్ ప్రక్రియను ఆరంభించబోతోన్నామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక లాక్‌డౌన్‌ను పొడిగించట్లేదని తేల్చి చెప్పారు. తొలివిడతలో భవన నిర్మాణ పనులు, ఫ్యాక్టరీల పునరుద్ధరణకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ రెండు రంగాలు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోన్నాయని, వాటిపై ఆధారపడిన దినసరి వేతన కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రంగాలకు అన్‌లాక్ తొలిదశలో ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.

లెప్టినెంట్ గవర్నర్‌తో భేటీ..

లెప్టినెంట్ గవర్నర్‌తో భేటీ..

అంతకుముందు- కేజ్రీవాల్ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమయ్యారు. లాక్‌డౌన్ అమలు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, తీసుకున్న చర్యలు, కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గురించి ఆయన వివరించారు. అన్‌లాక్ చేయాల్సిన అవసరం గురించీ వివరించారు. అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించడానికి అనుసరించదలిచిన వ్యూహాలనూ బైజల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కేజ్రీవాల్.. విలేకరులతో మాట్లాడారు. అన్‌లాక్‌పై విస్పష్టమైన ప్రకటన చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింత తగ్గుముఖం పడితే.. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామని తాను ఇదివరకే హామీ ఇచ్చానని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

  Tv Actress Sravani మరణంలో షాకింగ్ విషయాలు | శారీరకంగా ప్రియుడి వేధింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తూ !
  English summary
  Delhi government has decided to begin the unlock process. Addressing the media after meeting L-G Anil Baijal, Kejriwal said that relaxations will be given to businesses from May 31. He said that factories and construction activities will be allowed in the city for one week from Monday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X