వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు : పారామిలటరీపై యాసిడ్ దాడి.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం అదనపు బలగాలను మోహరించింది.అయితే ఆందోళనకారులు పోలీసులు,పారామిలటరీ బలగాలపై దాడులు చేస్తుండటం సమస్యను మరింత జటిలం చేస్తోంది. తాజాగా నార్త్ ఢిల్లీలోని కరవాల్ నగర్‌లో పారామిలటరీ బలగాలపై కొంతమంది ఆందోళనకారులు యాసిడ్ లాంటి కెమికల్‌తో దాడి చేశారు. గాయపడ్డ పారామిలటరీ జవాన్లను చికిత్స కోసం జీటీబీ ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీ అల్లర్లలో మృత్యు ఘంటికలు.. 11కి చేరిన మృతుల సంఖ్య.. డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి..ఢిల్లీ అల్లర్లలో మృత్యు ఘంటికలు.. 11కి చేరిన మృతుల సంఖ్య.. డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి..

 పారామిలటరీపై యాసిడ్ దాడి.. 13కి పెరిగిన మృతుల సంఖ్య

పారామిలటరీపై యాసిడ్ దాడి.. 13కి పెరిగిన మృతుల సంఖ్య


హింసాత్మక ఘటనలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అదనపు బలగాలను నార్త్ ఢిల్లీలో మోహరించింది. ఇందులో భాగంగా కొంతమంది పారామిలటరీ బలగాలు కరవాల్ నగర్‌లో ఆందోళనకారులను చెదరగొడుతుండగా.. కొంతమంది ఆందోళనకారులు ఇళ్ల టెర్రస్‌లపై నుంచి యాసిడ్‌తో దాడి చేశారు. హుటాహుటిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు.ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 13కి చేరగా.. 150 మంది గాయపడ్డారు. ఇక జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్ వద్ద సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.

షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వలేదన్న ఢిల్లీ పోలీస్..


ఢిల్లీలో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసినట్టు కొన్ని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికే ఢిల్లీ పోలీసులు దీనిపై స్పందించారు. ఇప్పటివరకు అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో పరిస్థితిని అదుపు చేసేందుకు హోం మంత్రిత్వ శాఖ వద్ద తగినంత ఫోర్స్ లేదని ఒక అధికారి వెల్లడించినట్టుగా వచ్చిన వార్తలను ఢిల్లీ సీపీ అమూల్య నాయక్ ఖండించారు. అది తప్పుడు సమాచారం అని కొట్టిపారేశారు.

 సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయా ప్రాంతాల పరిధిలో జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విజ్ఞప్తి తర్వాత సీబీఎస్ఈ బోర్డు దీనిపై అధికారిక ప్రకటన చేసింది. నార్త్ ఢిల్లీ పరిధిలో 10,11,12 తరగతుల సీబీఎస్ఈ పరీక్షలను బోర్డు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

Recommended Video

Muslim Women Dharna At Hyderabad Dharna Chowk Against CAA | Oneindia Telugu
ఢిల్లీ అల్లర్లు కలచివేస్తున్నాయన్న మమతా..

ఢిల్లీ అల్లర్లు కలచివేస్తున్నాయన్న మమతా..

ఢిల్లీలో నెలకొన్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరుగుతున్న ఘటనలు తమను తీవ్రంగా కలచివేస్తున్నాయని చెప్పారు. పరిస్థితులను తాము గమనిస్తున్నామని.. దేశంలో హింసకు తావు లేదని చెప్పారు. భారత దేశ ప్రజలుగా మనందరం శాంతిని కోరుకుంటున్నామని,ప్రతీ ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.

English summary
Delhi is witnessing one of the most worrying faces of violence in recent times. Frenzied groups, protesting against the new citizenship law (CAA), continue to unleash violence in north-east Delhi as they vandalized shops, pelted stones at police and even threw acid at paramilitary forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X