వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24కి చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలోని అమెరికన్లకు యూఎస్ఏ కీలక సూచన..

|
Google Oneindia TeluguNews

మూడు రోజుల హింసాత్మక ఘటనల తర్వాత ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. ఇప్పటివరకు 106 మందిని అరెస్ట్ చేశారు. 18 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అదనపు పారా మిలటరీ బలగాలను,సీనియర్ అధికారులను మోహరించారు. బుధవారం ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. నేటి సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పోలీసులు ఈ వివరాలు వెల్లడించారు.

హత్యకు గురైన ఐబీ ఆఫీసర్ కుటుంబ సభ్యుల ఆవేదన ఇదీ.. అతనే బాధ్యుడని ఆరోపణలు.. హత్యకు గురైన ఐబీ ఆఫీసర్ కుటుంబ సభ్యుల ఆవేదన ఇదీ.. అతనే బాధ్యుడని ఆరోపణలు..

డ్రోన్స్ సాయంతో..

డ్రోన్స్ సాయంతో..

అత్యవసర సమాచారాన్ని 112 కి చేరవేయాలని.. ఒకవేళ నంబర్‌కి కనెక్ట్ కాకపోతే 22829334, 22829335 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో.. ఆయా ఇళ్లపై జరిగిన రాళ్ల దాడులను పరిశీలించారు. ఇంటిపై కప్పులను డ్రోన్స్‌ సాయంతో పరిశీలించారు. ఖజురి ఖాస్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు పలు వాహనాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. దుండగులను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్ట్ చేస్తామని.. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఢిల్లీ పోలీస్ పీఆర్వో రంధవా తెలిపారు.

అమెరికన్ పౌరులకు యూఎస్ఏ సూచన

అమెరికన్ పౌరులకు యూఎస్ఏ సూచన

ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి తమ పౌరులకు అమెరికా సూచనలు చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన ప్రారంభమైన రోజు నుంచే ఢిల్లీలో అల్లర్లు చెలరేగడం గమనార్హం. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సీఏఏ ఆందోళనకారులు ట్రంప్ పర్యటన సందర్భంగా హింసకు పాల్పడుతున్నారని పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం అల్లర్ల వెనకాల బీజేపీనే ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

మృతుల సంఖ్య 24

మృతుల సంఖ్య 24


హింసాత్మక ఘటనల్లో మృతి చెందినవారి సంఖ్య 24కి చేరుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈశాన్య ఢిల్లీలో పర్యటిస్తూ.. అక్కడి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. సీలంపూర్,శివ్ విహార్ సహా తదితర ప్రాంతాల్లో వారు పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే,ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు ముందు విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నలుగురు బీజేపీ నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులు కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని హెచ్చరించింది.

English summary
18 FIRs have been registered in connection to the violence and investigation is underway. 106 people have been arrested. Additional para-military forces and senior officers have been deployed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X