వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు..హారర్ సినిమా: సిక్కుల ఊచకోత కంటే భయానకం: శివసేన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా దేశ రాజధానిలో ఆందోళనలను చేపట్టిన ప్రదర్శనకారులపై చోటు చేసుకుంటున్న దాడులు హారర్ సినిమాను తలపిస్తున్నాయని శివసేన వ్యాఖ్యానించింది. 1984 నాటి సిక్కుల ఊచకోత తరహాలోనే ఈ వరుస ఘటనలు కొనసాగుతున్నాయని పేర్కొంది. శివసేన మౌత్ పీస్‌గా భావించే సామ్నా పత్రిక ఢిల్లీ అల్లర్లపై బుధవారం ఎడిటోరియల్‌ను ప్రచురించింది.

భారత్ శాంతికాముక దేశమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీర్తించిన కొన్ని గంటల వ్యవధిలో ఏకంగా దేశ రాజధాని వీధుల్లో రక్తం ఏరులై పారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి మారణ కాండను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించింది. కత్తులు, రివాల్వర్లతో గుర్తు తెలియని వ్యక్తులు స్వైరవిహారం చేయడాన్ని 1984 నాటి సిక్కుల ఊచకోత తరువాత ఇప్పడే చూస్తున్నామని పేర్కొంది.

Delhi violence like a horror film, reality of the 1984 anti-Sikh riots

ఢిల్లీ గల్లీలను ఖాళీ చేయకపోతే తామే ఖాళీ చేయిస్తామంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ప్రకటనలను సామ్నా ప్రతిక తన ఎడిటోరియల్‌లో ఉంటంకించింది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా పేరును ప్రస్తావించకుండా ఆయనపై నిప్పులు చెరిగింది. ప్రజలను రెచ్చగొట్టే ధోరణిని బీజేపీ నాయకులు గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఎందుకు మానుకోలేకపోతున్నారని నిలదీసింది.

ఢిల్లీలో చోటు చేసుకుంటున్న అల్లర్లు, హింసాత్మక పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యతను వహించాల్సి ఉంటుందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది సామ్నా పత్రిక. అల్లర్లను ప్రోత్సహించేలా వ్యాఖ్యానించిన బీజేపీ నేతలపై ఎలాంటి చర్యలను తీసుకున్నారో.. తీసుకోబోతున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. శాంతియుత వాతావరణాన్ని, సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది.

English summary
Observing that the violence in Delhi is akin to a "horror film" depicting the grim reality of the 1984 anti-Sikh riots, the Shiv Sena on February 26 said the "bloodbath" has brought disrepute to the national capital like never before while US President Donald Trump was in India with the "message of love". The editorial in party mouthpiece 'Saamana' lamented that Trump was welcomed in Delhi while there was bloodbath on the streets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X