వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా నుంచి భారత్‌కు జైట్లీ.. సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ భారత్‌కు తిరిగి వచ్చారు. అమెరికాలో ఆయన దాదాపు నెలరోజుల పాటు చికిత్స పొందారు. తన తొడభాగంలో టిష్యూ కేన్సర్ రావడంతో చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. ఇదిలా ఉంటే భారత్‌కు తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందంటూ అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే గతేడాది ఏప్రిల్‌లో అనారోగ్యంతో జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. అనంతరం ఆయన డయాలసిస్ చేయించుకున్నారు. మే 14, 2018న రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగింది. ఇక అప్పటి నుంచి తన బాధ్యతలకు కాస్త దూరంగా ఉంటున్నారు జైట్లీ. జైట్లీ అమెరికాకు వెళ్లిపోవడంతో కేంద్ర ఆర్థిక మంత్రి బాద్యతలను పీయుష్ గోయల్ తీసుకున్నారు. ఫిబ్రవరి 1న పీయూష్ గోయలే మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అమెరికాలో ఉన్నప్పటికీ జైట్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకునేవారు.

Delighted to be back home tweets Jaitley after returning from US

ఈ మధ్యనే ఓ వార్తా సంస్థ జైట్లీ ఆరోగ్యం మెరుగుపడుతోందంటూ కథనం రాసింది. అంతేకాదు పార్లమెంటు సమావేశాలు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే అది డాక్టరు సలహా మేరకే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. గతనెలలోనే జైట్లీకి మరో ఆరోగ్య సమస్య తలెత్తడంతో అమెరికాకు వెళ్లారు. సర్జరీ అనంతరం కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకున్న ఆయన తిరిగి భారత్ చేరుకున్నారు.

English summary
Union Minister Arun Jaitley, who had gone to the United States for medical treatment in January, has returned to India. He was in the US for almost a month. Jaitley had reportedly gone to a hospital in New York for treatment of soft tissue cancer in his thigh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X