Delivery boy: వీడి పని ఏంది ?, వీడు చేస్తున్నది ఏమిటి ?, అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్ !
బెంగళూరు/ ఎలక్ట్రానిక్ సిటీ: ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పగలు, అర్దరాత్రి వరకు తిరుగుతున్నాడు. ఐటీ హబ్ లోని అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్న అతనికి అనేక మంది అమ్మాయిలు, ఆంటీల ఫోన్ నెంబర్లు తెలుసు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అమ్మాయిలను పరిచయం చేసుకున్నంటున్న కామాంధుడు అతని అసలు స్వరూపం చూపిస్తున్నాడు.
Illegal affair: దుబాయ్ లో మొగుడు, ఇంట్లో దుప్పటి కింద ప్రియుడు, ఇంటికి వెళ్లి భర్త ఏం చేశాడంటే ? !

డెలవరీ బాయ్
మహిళలకు మాయమాటలు చెప్పి వారితో అసభ్యంగా ప్రవర్తించి వారి అర్దనగ్న ఫోటోలు, నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న కామాంధుడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. బెంగళూరు నగరంలోని మడివాళలో పురుషోత్తమ్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జుమాటోలో పురుషోత్తమ్ డెలవరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

ఫోటోలు, వీడియోలు
ఫుడ్ డెలవరీ చేసే సమయంలో కొందరితో పరిచయం పెంచుకున్న పురుషోత్తమ్ వారితో టచ్ లో ఉన్నాడు. ఇదే సమయంలో ఫోస్ బుక్ లో రిక్వెస్ట్ పంపిస్తున్న పురుషోత్తమ్ అమ్మాయిలు, వివాహిత మహిళలతో పరిచయాలు పెంచుకుంటున్నాడు. తరువాత కొందరికి మాయమాటలు చెబుతున్న పురుషోత్తమ్ కొందరిని లొంగదీసుకుని వారి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సంపాధిస్తున్నాడు.

బ్లాక్ మెయిల్ చేస్తున్న శాడిస్టు
మహిళల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సంపాధిస్తున్న పురుషోత్తమ్ తరువాత వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓ యువతి పురుషోత్తమ్ టార్చర్ తట్టుకోలేక అతని మీద పోలీసు కేసు పెట్టడంతో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. పురుషోత్తమ్ ను అరెస్టు చేసిన పోలీసులు అతని నరాలు పిండేశారు. అమాయకులైన అమ్మాయిలు, మహిళల జీవితాలతో పురుషోత్తమ్ చెలగాటం ఆడుతున్నాడని పోలీసులు అంటున్నారు.