వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రభావం చూపేది ఇదే.. గులేరియా ఏం చెప్పారంటే
కరోనా వ్యాక్సిన్ సామర్థ్యంపై డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. అయినప్పటికీ టీకాలు మాత్రం సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ ఇంకా ఆందోళనకర స్థాయికి చేరలేదని పేర్కొన్నారు. అయితే, భారత్‌లో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ దీనిపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. అయితే, మరణాల్ని, తీవ్ర అనారోగ్యాన్ని తగ్గించడమే టీకా ముఖ్యోద్దేశమని తెలిపారు. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడం వల్ల రోగనిరోధకత మరింత పెరుగుతుందని ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోందని గులేరియా స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం అందుబాటులోకి వస్తున్న కొద్దీ అవసరమైన మేర మార్పులు చేర్పులు ఉంటాయన్నారు.

ఇక ప్రజలు కరోనా కట్టడి నిబంధనల్ని తప్పక పాటించాల్సిందేనన్నారు. మూడో వేవ్ ఉద్భవించడం ప్రజలు వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. గుంపులుగా సమావేశం కాకుండా గట్టి నిఘా ఉంచడం సహా ఇతర కట్టడి నిబంధనల్ని పాటించడం, వ్యాక్సినేషన్ పురోగతిపైనే కరోనా మూడో దశ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా గ్రీన్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications