• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'డెల్టా ప్లస్'తో థర్డ్ వేవ్ ముప్పు తప్పదా-ఇది సోకితే కనిపించే లక్షణాలేంటి-ఏ వ్యాక్సిన్లు దీనిపై పనిచేస్తాయి..

|

కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న దేశానికి థర్డ్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ సృష్టించిన ప్రళయం ఏ స్థాయి విషాదాన్ని మిగిల్చిందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. సెకండ్ వేవే ఇంత ప్రమాదకర స్థాయిలో ఉంటే ఇక థర్డ్ వేవ్ ఇంకెంత ప్రమాదకరంగా ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది. సెకండ్ వేవ్ ఉధృతికి కారణమైన డెల్టా వేరియంట్ నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుకురావడంతో... ఇది థర్డ్ వేవ్‌కు దారితీయవచ్చునన్న అనుమానాలు,ఆందోళన వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో అసలు డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుక,దాని లక్షణాలు,ప్రభావం గురించి పరిశీలిద్దాం...

'డెల్టా' వేరియంట్-ఒరిజినల్ కంటే డేంజర్-సెకండ్ వేవ్‌ తీవ్రతకు కారణమదే?-యూకెను వణికిస్తోంది'డెల్టా' వేరియంట్-ఒరిజినల్ కంటే డేంజర్-సెకండ్ వేవ్‌ తీవ్రతకు కారణమదే?-యూకెను వణికిస్తోంది

డెల్టా ప్లస్ వేరియంట్...

డెల్టా ప్లస్ వేరియంట్...

భారత్‌లో గతేడాది గుర్తించిన కోవిడ్ వేరియంట్‌ B.1.617.2ని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది. ఆందోళనకర వైరస్‌గా దీన్ని గుర్తించింది. యూకెలో ఈ కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. ఇదే డెల్టా వేరియంట్‌ ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. డెల్టా ప్లస్ లేదా AY.01గా చెబుతున్న ఈ వైరస్ కేసులు దేశంలోని మూడు రాష్ట్రాల్లో బయటపడ్డాయి. డెల్టా వేరియంట్ కంటే దీని వ్యాప్తి రెట్టింపు ఉండొచ్చునని... రోగ నిరోధక శక్తిని సైతం ఇది తట్టుకోగలదేమోనని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తుండటంతో... థర్డ్ వేవ్‌ ముప్పు దీని రూపంలోనే పొంచి ఉందా అన్న చర్చ జరుగుతోంది.

ఆ ట్రీట్‌మెంట్‌కు లొంగకపోవచ్చు..

ఆ ట్రీట్‌మెంట్‌కు లొంగకపోవచ్చు..

డెల్టా ప్లస్ వేరియంట్‌లోని స్పైక్ ప్రోటీన్‌ K417N అనే మ్యుటేషన్‌ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన మొదటి సీక్వెన్స్‌ను మార్చి,2021లో యూరోప్‌లో గుర్తించారు. తాజాగా దేశంలోని మూడు రాష్ట్రాల్లో 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని రత్నగిరి,సింధు దుర్గ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవడంతో.... అక్కడి శాంపిల్స్‌పై నేషనల్ కెమికల్ ల్యాబోరేటరీ(CSIR-NCL)లో అధ్యయనం చేయనున్నారు. COVID-19ని నయం చేసేందుకు చేసే మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ట్రీట్‌మెంట్‌లకు సైతం ఇది లొంగకపోవచ్చునని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ట్రీట్‌మెంట్‌లో కెసిరివిమాబ్, ఇమ్ డెవిమాబ్ అనే రెండు మందుల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఇటీవలే భారత్ ఈ ట్రీట్‌మెంట్‌కు అనుమతినిచ్చింది.

డెల్టా ప్లస్ వేరియంట్... లక్షణాలు...

డెల్టా ప్లస్ వేరియంట్... లక్షణాలు...

కోవిడ్ 19కి,డెల్టా ప్లస్ వేరియంట్‌కు మధ్య తేడాను గుర్తించేందుకు సైంటిస్టులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. సాధారణంగా కోవిడ్ సోకినవారిలో జ్వరం,దగ్గు,నీరసం,ఒళ్లు నొప్పులు,చర్మంపై దద్దుర్లు,గొంతు నొప్పి,వాసన కోల్పోవడం,డయేరియా,తలనొప్పి,ఛాతినొప్పి,శ్వాసకోశ సమస్యలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. డెల్టా వేరియంట్‌లో కోవిడ్ లక్షణాలతో పాటు కడుపునొప్పి,వాంతులు,కీళ్ల నొప్పులు,వికారం,వినికిడి లోపం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

వ్యాక్సిన్లు పనిచేస్తాయా...?

వ్యాక్సిన్లు పనిచేస్తాయా...?

డెల్టా ప్లస్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డా.స్కాట్ గాట్లిబ్ దీనిపై స్పందిస్తూ... వ్యాక్సిన్లు దీనిపై ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉందన్నారు. mRNA వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై 88శాతం సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని... వైరల్ వెక్టార్ వ్యాక్సిన్లు జాన్సన్ అండ్ జాన్సన్,అస్ట్రాజెనెకా 66శాతం సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అన్నారు. మోడెర్నా,ఫైజర్,బయోఎన్‌టెక్ వ్యాక్సిన్లను mRNA టెక్నాలజీతో అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఉపయోగిస్తున్న కోవాగ్జిన్,కోవీషీల్డ్ రెండూ డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తాయని ఎయిమ్స్ వెల్లడించింది.

తక్కువ అంచనా వేయవద్దు...

తక్కువ అంచనా వేయవద్దు...


ఇప్పటికైతే డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి భారత్‌లో తక్కువగానే ఉన్నందునా అంతగా ఆందోళన చెందనక్కర్లేదన్న అభిప్రాయాలు సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న నంబర్ల ఆధారంగా వైరస్ ట్రెండ్‌ను అంచనా వేయలేమన్న వాదన కూడా వినిపిస్తోంది. గతంలో డెల్టా వేరియంట్ కేసులు కూడా తక్కువ సంఖ్యలోనే నమోదై... ఆ తర్వాత సెకండ్ వేవ్ ఉధృతికి దారితీయడం గమనార్హం. ఆ లెక్కన డెల్టా ప్లస్ వేరియంట్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను త్వరితగతిన గుర్తించడం.. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయడమే దీనికి పరిష్కారమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకె పాల్ పేర్కొన్నారు.

English summary
The spike protein in the Delta Plus variant contains a mutation called K417N. The first sequence was found in Europe in March, 2021. Recently, 22 Delta Plus variant cases were reported in three states of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X