వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీకాలు తీసుకున్న వారికి సవాల్ గా కరోనా డెల్టా వేరియంట్ .. భారీగా కేసులు, సాక్ష్యాలివే... బీ అలెర్ట్ !!

|
Google Oneindia TeluguNews

ప్రపంచం ప్రస్తుతం కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ఉత్పాతాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఇండియన్ మ్యుటేషన్ డెల్టా వేరియంట్ పై ప్రపంచ దేశాలకు భయం పట్టుకుంది. భారతదేశంలో మొదట గుర్తించిన డెల్టా వేరియంట్ గురించి ప్రధాన ఆందోళన ఏమిటంటే, ఇది అతి తక్కువ కాలంలో వ్యాపిస్తుంది, ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తుంది. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి చాలా తేలికగా వ్యాపిస్తుంది. దీని వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మందికి ఇది సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

టీకాల ద్వారా వచ్చే వ్యాధి నిరోధక శక్తిని ఏమార్చే డెల్టా వేరియంట్

టీకాల ద్వారా వచ్చే వ్యాధి నిరోధక శక్తిని ఏమార్చే డెల్టా వేరియంట్

కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లినప్పటినుంచి ఇన్ఫెక్షన్ బారిన పడటానికి మధ్య సరాసరి ఆరు రోజుల వ్యవధి ఉండేది. కానీ డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయిందని, అంతే కాదు దీంతో ఇన్ఫెక్షన్ సోకడానికి ముందే వారిని గుర్తించడం మరింత కష్టం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. డెల్టా వేరియంట్ టీకాల ద్వారా లభించిన రోగనిరోధక శక్తిని కూడా కొంతమేర ఏమార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని ఇది ఎక్కువగా టీకాలు వేసిన వ్యక్తులకు కూడా సోకటమే ఇందుకు ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు .

ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా డెల్టా వేరియంట్

ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా డెల్టా వేరియంట్

"ప్రస్తుతానికి ప్రపంచానికి అతి పెద్ద ప్రమాదం డెల్టా మాత్రమే" అని కరోనావైరస్ వేరియంట్ల జన్యువులను క్రమం చేయడానికి అధ్యయనం చేస్తున్న బ్రిటన్ మైక్రోబయాలజిస్ట్ షరోన్ పీకాక్ పేర్కొన్నారు. దీనిని "ఇంకా అత్యంత వేగవంతమైన వేరియంట్" అని పేర్కొన్నారు .వైరస్లు మ్యుటేషన్ ద్వారా నిరంతరం అభివృద్ధి చెందుతాయి, కొత్త వైవిధ్యాలు పుట్టుకొస్తాయి. కొన్నిసార్లు ఇవి అసలు కన్నా ప్రమాదకరమైనవిగా మారతాయని అంటున్నారు.

Recommended Video

Covid-19 Third Wave Likely In August India To See 1 Lakh Cases Daily Says ICMR Scientist
ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా డెల్టా వేరియంట్

ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా డెల్టా వేరియంట్

డెల్టా వేరియంట్ ట్రాన్స్మిషన్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి కూడా వస్తుండడం గమనార్హం. డెల్టా వేరియంట్‌తో బ్రిటన్‌లో ఆసుపత్రిలో చేరిన మొత్తం 3,692 మందిలో 58.3% మంది వ్యాక్సిన్ తీసుకోనివారు కాగా 22.8% మందికి టీకాలు తీసుకున్నట్టు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వెల్లడించింది. డెల్టా వేరియంట్ సింగపూర్‌లో, టీకాలు వేసిన వ్యక్తులలో మూడొంతుల కేసులు నమోదు చేశాయని ప్రభుత్వ అధికారులు నివేదించారు. ఇక చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకుతుంది.

టీకాలు తీసుకున్నా సరే సవాల్ గా మారిన డెల్టా వేరియంట్

టీకాలు తీసుకున్నా సరే సవాల్ గా మారిన డెల్టా వేరియంట్

ఇతర దేశాలకన్నా ఎక్కువ కరోనా కేసులు మరియు మరణాలను నమోదు చేసిన యునైటెడ్ స్టేట్స్ లో, డెల్టా వేరియంట్ 83% కొత్త ఇన్ఫెక్షన్లను సూచిస్తుంది. వీరిలో వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా ఉండటం గమనార్హం. అందుకే టీకాలు తీసుకున్న వారికి సైతం డెల్టా వేరియంట్ ఒక సవాల్ గా మారిందని వారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా బారిన పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు.

English summary
Experts say that the Delta variant has the potential to mitigate some of the immunity gained through vaccines, an example of which is the fact that most vaccinated people are also infected. It is noteworthy that the delta variant transmission also comes to those who have been vaccinated. That's why medical experts say vaccinated people also to take care.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X