వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముదురుతున్న రంజన్ గొగోయ్ వివాదం...రిపోర్ట్ ఇవ్వాలంటూ లేఖ

|
Google Oneindia TeluguNews

చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్ కేసు పలుమలుపులు తిరుగుతోంది. లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జస్టీస్‌కు సుప్రిం కోర్టు అంతర్గత కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో పెద్ద వివాదం రేగుతోంది. దీంతో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ కమిటి రిపోర్ట్ ఇవ్వాలంటూ లేఖ రాసింది..మరోవైపు ఈ వివదంపై గతంలో ఎన్నడు లేనట్టుగా సుప్రిం కోర్టు ముందే మహిళ సంఘాలు ఆందోళన నిర్వహించారు.

రంజన్ గొగోయ్ క్లీన్‌చిట్ రిపోర్ట్ ఇవ్వండి

రంజన్ గొగోయ్ క్లీన్‌చిట్ రిపోర్ట్ ఇవ్వండి

సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ అంతర్గత కమిటి యొక్క నిర్ణయం పై స్పందించింది. దీంతో సుప్రిం కోర్టు అంతర్గత కమిటి రిపోర్ట్ ను తనకు ఇవ్వాలని కమిటికి లేఖ రాసింది. ఈనేపథ్యంలోనే రిపోర్ట్ కాపిని తీసుకోవడం నా హక్కు అంటూ ఆమే పేర్కోంది. కాగా అంతకుముందే ఆమే తీర్పుపై భయాందోళనలు వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయ స్థానం విశ్వాసం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

 విచారణ రిపోర్ట్ కాపిని ఇవ్వని సుప్రిం అంతర్గత కమీటి

విచారణ రిపోర్ట్ కాపిని ఇవ్వని సుప్రిం అంతర్గత కమీటి

సుప్రిం ప్రధాన న్యాయమూర్తి అయిన రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరపణల కేసును ముగ్గురు సభ్యులు గల అంతర్గత బెంచ్ రెండు రోజుల క్రితం విచారణ చేపట్టింది. ఈ విచారణంలో భాదిత మహిళ హజరుకాలేదు. దీంతో అంతర్గత కమిటి ఆమే సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించింది. దీంతో సోమవారం రంజన్ గొగోయ్ కి లైంగిక వేధింపుల్లో క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే విచారణకు సంబంధించి ఎలాంటీ రిపోర్ట్ కాపీని అందించమని చెప్పింది.ఇది కేవలం సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రంజన్ గొగోయ్ తోపాటు ఆయన తర్వాతి స్థానంలో ఉన్న న్యాయమూర్తికి మాత్రమే అందిస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఆ రిపోర్ట్ కాపిని తనకు సైతం ఇవ్వాలని కమిటికి లేఖ రాసింది.

గతంలో కూడ ఇలాంటీ కేసు , విచారణ కాపి ఇవ్వని వైనం

గతంలో కూడ ఇలాంటీ కేసు , విచారణ కాపి ఇవ్వని వైనం

అయితే సుప్రిం కోర్టు వర్సెస్ ఇందిరా జైసింగ్ కేసును ఉదహరిస్తూ అంతర్గత కమిటి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కోంది. అయితే 2003 కూడ సుప్రిం కోర్టు న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇద్దరు జడ్జిల కమిటి అయిన జస్టీస్ ఎస్ రాజేంద్రబాబు జస్టీస్ జీపీ మథూర్‌లు తీర్పు ఇచ్చారు.దీన్ని సైతం బహిర్గత పరచలేదు. ఈనేపథ్యంలో కోర్టు తీర్పు సైతం వెలువరించింది. ఇలా అంతర్గత కమిటిల ద్వార నివేదికలు బహిరంగపరిస్తే సుప్రిం కోర్టు వ్యవస్థపై చెడు అభిప్రాయం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయిన కోర్టు పేర్కోంది. అయితే తాజగా ఇందిరా జైసింగ్ కూడ దీనిపై మండిపడింది. ఇది పెద్ద స్కాం గా పేర్కోంది.

English summary
The former Supreme Court employee, who had levelled allegations of sexual harassment against Chief Justice of India (CJI) Ranjan Gogoi, on Tuesday wrote to the in-house committee and demanded a copy of its report on clean chit to the CJI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X