బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus:కరోనా... కరోనా.... కరోనా.... రూ. 20 కరోనా, వైరల్ వీడియో, బ్లాక్ మార్కెట్, భారీ డిమాండ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వ్యాధి (COVID 19) వణికిస్తోంది. భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి కేసులు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధితో ఇప్పటి వరకు 4,971 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కరోనా వైరస్ ను అరికట్టడానికి ఆ వ్యాధి నివారణ మందును కనిపెట్టడానికి ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు, వైద్యులు శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి కేవలం రూ. 20 చాలు అంటూ కొందరు రోడ్ల మీదకు వచ్చారు. కరోనా.... కరోనా.... కరోనా.... రూ. 20 కరోనా అంటూ మాస్క్ లు విక్రయిస్తున్న చిరు వ్యాపారుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు మందు కనిపెట్టిన సీఎం ఇబ్రహీం, చెప్పింది చెయ్యండి, రింగ్ టోన్ కాదు !కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు మందు కనిపెట్టిన సీఎం ఇబ్రహీం, చెప్పింది చెయ్యండి, రింగ్ టోన్ కాదు !

ప్రపంచానికి కరోనా వైరస్ సవాల్

ప్రపంచానికి కరోనా వైరస్ సవాల్

ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ వ్యాధి సవాలుగా మారింది. కరోనా వైరస్ వ్యాధితో ఇప్పటికే 4 వేల 971 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి పేరు చెబితే పిల్లలతో సహ ప్రజలు అందరూ భయంతో హడలిపోతున్నారు. కరోనా వైరస్ వ్యాధిని కట్టడానికి చెయ్యడానికి శాస్త్రవేత్తలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

లక్షల మందికి కరోనా వైరస్

లక్షల మందికి కరోనా వైరస్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1, 34, 558 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారికంగా వెలుగు చూసింది. కరోనా వైరస్ వ్యాధితో 4,971 మంది మరణించారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన 68, 934 మంది బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలతో భయటపడ్డారు. ఇంకా ఎంత మందికి కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో ? అనే విషయం అంతు చిక్కడం లేదని ప్రపంచ దేశాల శాస్త్రేవత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా.... కరోనా..... రూ. 20 రుపాయ్ కరోనా !

కరోనా.... కరోనా..... రూ. 20 రుపాయ్ కరోనా !

భారతదేశంలోని రద్దీగా ఉంటున్న ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదే సమయంలో రద్దీగా ఉన్న మార్కెట్ దగ్గర కొందరు కరోనా... కరోనా.... రూ. 20 రుపాయ్ కరోనా అంటూ జోరుగా అరుస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల కోసం ముఖానికి మాస్క్ లు వేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో ముఖానికి వేసుకునే మాస్క్ లను విక్రయించడానికి కొందరు కరోనా కరోనా జస్ట్ రూ. 20 కరోనా అంటూ ఈ పద్దతి ఫాలో అవుతున్నారు.

కరోనా కరోనా వీడియోలు వైరల్

కరోనా కరోనా వీడియోలు వైరల్

బెంగళూరులోని మార్కెట్ లు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కొందరు కరోనా.... కోరోనా..... రూ. 20 రుపాయ్ కరోనా అంటూ మాస్క్ లు విక్రయిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవ్వరు చూసినా కరోనా వైరస్ వ్యాధి భయంతో హడలిపోతున్నారు. ఇప్పటికే బెంగళూరు నగరంలో ఐదు కరోనా వైరస్ వ్యాధి కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.

మాస్క్ లకు భారీ డిమాండ్

మాస్క్ లకు భారీ డిమాండ్

ముఖానికి వేసుకునే మాస్క్ లకు మార్కెట్ లో భారీ డిమాండ్ ఎర్పడింది. మామూలు ధరకు విక్రయించే ముఖానికి వేసుకునే మాస్క్ లను రెండింతలు, మూడింతల ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న కొందరు ప్రజలను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని మెడికల్ షాప్స్ లో నో స్టాక్ అంటూ బోర్డులు తగిలించి బ్లాక్ మార్కెట్ లో ముఖానికి వేసుకుని మాస్క్ లు విక్రయించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Demand for mask after Coronavirus (COVID 19) case found in Bengaluru in Karnataka. Here are the viral video in the market man selling mask in the name of Corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X