వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sakshi Maharaj: జామా మసీదును ధ్వంసం చేయండి..విగ్రహాలు లేకపోతే నన్ను ఉరి తీయండి: సాక్షి మహరాజ్

|
Google Oneindia TeluguNews

లక్నో: తరచూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లోకి ఎక్కే నాయకుడు సాక్షి మహరాజ్. మరోసారి ఆయన అలాంటి ప్రకటనే చేశారు. చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన మరుసటి రోజే ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ ర్యాలీకి హాజరైన భారతీయ జనతాపార్టీ లోక్ సభ సభ్యుడు సాక్షి మహారాజ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలోని ప్రఖ్యాత జామా మసీదును కూడా ధ్వంసం చేయాలని, దాని కింద హిందూ ఆలయాలు గానీ, విగ్రహాలు గానీ లభిస్తాయని అన్నారు. అలా విగ్రహాలు లభించకపోతే తనను ఉరి తీయాలని అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వెలువడిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ లో ఆదివారం ఉదయం హిందూ మహాసభ ప్రతినిధులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా సాక్షి మహరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ర్యాలీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యనాలు చేశారు. భారత్ లో ముస్లిం సామ్రాజ్యాన్ని విస్తరించిన మొఘల్ చక్రవర్తులు హిందూ ఆలయాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆలయాలను కూల్చివేసి, వాటిపై మసీదులను నిర్మించుకున్నారని, ఈ విషయం బాబ్రీ మసీదును ధ్వంసం చేయడంతో తేటతెల్లమైందని అన్నారు.

Demolish Jama Masjid in New Delhi, hang me if idols not found, says BJP MP Sakshi Maharaj

ఢిల్లీలోని జామా మసీదు కూడా అలాంటి నిర్మాణమేనని చెప్పారు. హస్తినను పరిపాలించిన హిందూ రాజులు నిర్మించిన ఆలయాన్ని ధ్వంసం చేసి, దానిపై మొఘల్ చక్రవర్తులు మసీదును నిర్మించారని ఆరోపించారు. 1644-1656 మధ్యకాలంలో అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ జామా మసీదును నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని, అంతకంటే ముందు అక్కడ ఆలయం ఉందనడానికి అదే స్థాయిలో చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. జామా మసీదు కింద హిందూ దేవుళ్ల విగ్రహాలు గనక లభించకపోయినా.. ఆలయం ఉన్నట్లు ఆనవాళ్లు లేకపోయినా తనను బహిరంగంగా ఉరి తీయాలని చెప్పారు. అయోధ్య ఒక్కటే కాదని, మథుర, వారణాశిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.

English summary
Bharatiya Janata Party Lok Sabha member Sakshi Maharaj who is known for making controversial remarks has come up with another shocker. Sakshi Maharaj has said that Delhi's Jama Masjid should be demolished because it has been constructed on the remains of a Hindu temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X