వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు: కరెన్సీతో చెల్లిస్తే.. కేంద్రం తదుపరి షాకింగ్ నిర్ణయం!!

నగదు చెల్లింపులను తగ్గించేందుకు ఎవరైతే డబ్బు ద్వారా చెల్లింపులు చేస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసేందుకు సమాయత్తమవనుందని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నల్లధనాన్ని అంతే చేసేందుకు, నగదు రహిత లావాదేవీల పెంచేందుకు కేంద్రం రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధాని మోడీ నవంబర్ 8వ తేదీన రాత్రిన నోట్ల రద్దును ప్రకటించారు. అప్పటి నుంచి నోట్ల రద్దు చర్చకు దారి తీసింది.

రూ.2 వేల నోటుపై మరో కొత్త ప్రచారం: ఇదీ వాస్తవం!రూ.2 వేల నోటుపై మరో కొత్త ప్రచారం: ఇదీ వాస్తవం!

నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రం త్వరలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్రం ఓ ప్యానెల్‌ను నియమించిన విషయం తెలిసిందే.

నగదు చెల్లింపు లావాదేవీలను తగ్గించే చర్యలకు దిగాలని ఈ ప్యానెల్ సూచించిందని తెలుస్తోంది. దీంతో నగదు చెల్లింపులను తగ్గించేందుకు ఎవరైతే డబ్బు ద్వారా చెల్లింపులు చేస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసేందుకు సమాయత్తమవనుందని తెలుస్తోంది.

 Demonetisation: Charge on cash usage maybe next as govt promotes digital payments

దీంతో సాధారణంగా ఇప్పటి వరకు ఏటీఎంలు, క్రెడిట్ కార్డుల ద్వారా స్వైపింగ్ చేసినప్పుడు వసూలు చేసే కనీస ఛార్జీలు త్వరలో, కార్డులకు కాకుండా ఎవరైతే డబ్బు ద్వారా చెల్లిస్తారో వారి నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశముంది.

ఈ పేమెంట్లను రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్రం ఈ చర్యను చేపట్టవచ్చునని, పెద్ద నోట్ల రద్దు అంశం తర్వాత త్వరలో కేంద్రం తీసుకురానున్న మరో మార్పు ఇదేనని ప్రచారం సాగుతోంది.

ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్ వతల్ పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు తగ్గించేందుకు ఈ సూచనలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 12 శాతం ఉన్న వాటాను 30 నుంచి 90 రోజుల మధ్య తగ్గించాలనుకుంటున్నారు.

English summary
If the government accepts recommendation of the panel established to suggest ways to promote cashless economy, charges on cash payment may be next in line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X