వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు చెత్త పని, మోడీకే తెలియదు: స్టీవ్ విమర్శలు

భాతర ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమరికా ఆర్థిక వేత్త స్టీవ్ హంకీ తప్పుబట్టారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భాతర ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మరో ఆర్థిక వేత్త తప్పుబట్టారు. నోట్ల రద్దు చేతగానితనమేనని తాజాగా ప్రఖ్యాత అమెరికా ఆర్థికవేత్త స్టీవ్‌ హెచ్‌ హాంకీ విమర్శించారు. ఆది నుంచీ ఇది గందరగోళంగానే సాగిందని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

'దేశమెటు పోతోందో ఎవరికీ తెలియదని.. మోడీకి అస్సలు తెలియదు' అని ఎద్దేవా చేశారు. స్టీవ్‌ గతంలో కూడా డీమోనిటైజేషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రకటించిన డీమోనిటైజేషన్‌ను అమలు చేసేంతగా భారత్‌లో మౌలికసదుపాయాలు లేవని ఆయన తెలిపారు.

ఈ విషయం మోడీ గుర్తెరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా, హంకీ విమర్శల పట్ల పలువురు భారత నెటిజన్లు మండిపడుతున్నారు. మోడీ సరైన నిర్ణయమే తీసుకున్నారని, మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే మీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చుకోండంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, డీమోనిటైజేషన్‌ ప్రభావంతో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిపై సుమారు అరశాతం వరకు ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలున్నాయి. నల్లధనం, నకిలీ నోట్ల నిర్మూలన కోసం గత నవంబర్ 8న రాత్రి ప్రధాని మోడీ పెద్ద నోట్ల(రూ. 500, 1000)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సుమారు 50రోజుల వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. ఇప్పుడు కొత్త నోట్లు అందుబాటులోకి రావడంతో ప్రజల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి.

English summary
Criticising India's decision to scrap high-value currency notes, noted American economist Steve H Hanke has said demonetisation is for 'losers' and even Prime Minister Narendra Modi does not know where the country is heading now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X