వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ తల్లికీ తప్పలేదు: క్యూలో నిల్చుని నోట్లు మార్చుకున్న హీరాబెన్

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: దేశంలోని నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గత మంగళవారం రాత్రి రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచి సామాన్యులకు ఇబ్బందులు మొదలయ్యాయి.

 Demonetisation: PM Modi's mother exchanges currency for Rs 4,500

అత్యవసరమైన విభాగాల్లో ఆ నోట్లను చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కింది స్థాయిలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇది ఇలా ఉంటే.. ప్రధాని మోడీ నిర్ణయం ఆయన తల్లి హీరా బెన్ కూడా బ్యాంకు వద్ద వరుసలో నిలబడేలా చేసింది.

 Demonetisation: PM Modi's mother exchanges currency for Rs 4,500

మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ కూడా తన వద్దనున్న పాత నోట్లను మార్చుకునేందుకు సామాన్యురాలిగా బ్యాంకుకు వచ్చారు. మంగళవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల ఓ బ్యాంకుకు చేరుకున్న ఆమె... పాత పెద్దనోట్లను మార్చుకుని కొత్తనోట్లను తీసుకున్నారు. ఆమె వెంట కుటుంబసభ్యులు ఉన్నారు.

English summary
Prime Minister Narendra Modi's mother Heeraben Modi was seen at a bank on Tuesday to exchange the recent demonetised notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X