వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు: కేంద్రమంత్రినే తిప్పలు పెట్టిన ప్రైవేట్ ఆస్పత్రి

పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలకే కాదు కేంద్ర మంత్రి సదానందగౌడకు కూడా ఇబ్బందులను కలిగించింది.

|
Google Oneindia TeluguNews

మంగళూరు: పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలకే కాదు కేంద్ర మంత్రి సదానందగౌడకు కూడా ఇబ్బందులను కలిగించింది. వైద్య ఖర్చుల బిల్లు చెల్లించేందుకు పాతనోట్లు స్వీరించేదిలేదని ఓ ఆస్పత్రి సిబ్బంది తెగేసి చెప్పడంతో మరో గత్యంతరం లేక ఆయన చెక్‌ అందించాల్సి వచ్చింది.

సదానందగౌడ సోదరుడు భాస్కరగౌడ మంగళూరులోని కేఎంసీ ఆస్పత్రిలో మంగళవారం కన్నుమూశారు. చికిత్స వ్యయాన్ని చెల్లించేందుకు కేంద్ర మంత్రి ముందుకు వచ్చారు.

demonetisation: sadananda gowda faces trouble retrieving brother body

ఆయన రద్దయిన పాతనోట్లను కౌంటర్‌లో అందజేయగా వాటిని స్వీకరించేందుకు అక్కడి ఉద్యోగులు నిరాకరించారు. దీంతో ఆయన చెక్‌ను అందించి బయటపడ్డారు.

అనంతరం కేంద్ర మంత్రి స్పందిస్తూ.. సదరు ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక కేంద్రమంత్రినే తిప్పలు పెట్టిన ప్రైవేటు ఆస్పత్రులకు.. ఇక సామాన్య ప్రజలు ఎంత? అని పలువురు అనుకుంటున్నారు.

English summary
The woes of demonetization hit Union Minister DV Sadananda Gowda after the death of his brother Bhaskar Gowda on Tuesday.Bhaskar died of jaundice on Tuesday at a private hospital in Mangaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X