వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనాలోచితం, విషాదం: నోట్ల రద్దుపై రాహుల్ గాంధీ

పెద్ద నోట్లను రద్దు చేసి బుధవారానికి ఏడాది పూర్తైన సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఓ విషాదం,

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసి బుధవారానికి ఏడాది పూర్తైన సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఓ విషాదం, ఆలోచన లేని చర్య అన్నారు. ఈ చర్య లక్షల మంది భారతీయుల జీవనోపాధిపై దెబ్బ కొట్టిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Demonetisation a tragedy, thoughtless act of PM: Rahul Gandhi

పెద్దనోట్ల రద్దు ఓ విషాదమని, మిలియన్ల మంది నిజాయతీపరులకు తాము అండగా ఉన్నామని, మోడీ అనాలోచిత చర్య కారణంగా నిజాయతీపరులైన భారతీయులు తమ జీవనోపాధిని కోల్పోయారని, ఒక్కరి కన్నీరైనా అది ప్రభుత్వానికి ప్రమాదకరమే అన్నారు.

పెద్ద నోట్ల రద్దు కారణంగా అనేకమంది తమ జీవితాలను, ఉద్యోగాలను కోల్పోయాలని చిదంబరం ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల బాధితులుగా మారిన వారి జీవితాల గురించి తెలుసుకొని ఈ బ్లాక్ డే రోజున వారి కోసం ప్రజలు ప్రార్థన చేయాల్సిందిగా కోరారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షల మంది జీవితాలు, ఉద్యోగాలు కోల్పోయారని, చిన్న వ్యాపారాలు మూతపడ్డాయన్నారు. ఇది ఎవరూ కాదనలేని సత్యమన్నారు.

ప్రస్తుతం రూ. 15 లక్షల కోట్లు నగదు చలామణీలో ఉందని, త్వరలో అది రూ. 17 లక్షల కోట్లకు చేరునుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు ఎంతమేర చలామణీలో ఉండాలనేది నిర్ణయం ఆర్బీఐ నిర్ణయించాలే తప్ప ప్రభుత్వం కాదన్నారు.

English summary
Congress vice-president Rahul Gandhi on the note ban anniversary today termed demonetisation as a "tragedy" and a "thoughtless act" and alleged that due to it livelihood of millions of honest Indians were destroyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X