వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో రాజేకు చేదు అనుభవం, కాంగ్రెస్ మండిపాటు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం వసుంధర రాజేకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిరాకరించారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఆ తర్వాత పార్టీ పెద్దలను, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించారు.

అయితే రాజేతో భేటీ అయ్యేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా విముఖత వ్యక్తం చేశారు. దీంతో రాజే నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే తిరిగి రాజస్థాన్‌కు బయలుదేరారు.

ఇటీవల కాలంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై విదేశాలకు పారిపోయేందుకు రాజే సాయం చేశారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

Vasundhara Raje
ఈ నేపథ్యంలో ఆమెతో భేటీ అయ్యేందుకు బీజేపీ అధిష్టానం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లను మోడీ వెనుకేసుకు రావడాన్ని తప్పుబట్టారు. ‘‘ప్రధాని మోడీ రాజే ధర్మం, లలిత్ ధర్మం.. కాకుండా రాజ ధర్మాన్ని పాటించాలి'' అని కాంగ్రెస్ హితవు పలికింది.

ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా, రాజేలను పదవుల నుంచి తొలగించాలని ఆ పార్టీ నేత అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంలో అవినీతి, బ్లాక్ మనీపై ప్రధాని మోడీ చేసిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోకుండా మోడీ వారిని కాపాడే ప్రయత్నం చేస్తుర్నారని అజయ్ కుమార్ విమర్శించారు.

English summary
Denied appointment by PM Modi and Amit Shah, Vasundhara Raje leaves Delhi after NITI Aayog meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X