వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లుంగీతో అనుమతి లేదన్న బార్ యాజమాన్యం...! విప్పి నిరసన తెలిపిన కస్టమర్

|
Google Oneindia TeluguNews

స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు రెస్టారెంట్‌కు వెళ్లిన వ్యక్తిని సిల్లి రీజన్‌తో హోటల్ సిబ్బంది అడ్డుకున్నారు. లుంగి కట్టుకుంటే బార్ అండ్ రెస్టారెంట్‌లోకి అనుమతి లేదని చెప్పడంతో సదరు వ్యక్తి ఉన్న లుంగి విప్పి వేసి రెస్టారెంట్ ముందే నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తనకు తనకు జరిగిన అవమానానికి పోలీసులకు పిర్యాధు చేశారు.

రెస్టారెంట్ ఎట్రన్స్‌ ముందే నగ్నంగా నిరసన....

రెస్టారెంట్ ఎట్రన్స్‌ ముందే నగ్నంగా నిరసన....

కేరళలోని కోజికోడ్ లో హోటల్ సీ క్వీన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఇందులో పార్టీ చేసుకునేందుకు కోంతమంది స్నేహితులతో కలిసి కరీం అనే ముస్లిం వ్యక్తి వెళ్లాడు. అయితే అందరిని లోపలికి అనుమతి ఇచ్చిన హోటల్ సిబ్బంది కరీంను మాత్రం లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే కరీం లుంగీతో ఉన్నాడనే కారణంతో లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కరీం రెస్టారెంట్ ముందే నిరసనకు దిగాడు. ఉన్న లుంగీ ఇప్పి నగ్నంగా రెస్టారెంట్ ఎంట్రన్స్‌లో నిలుచుని నిరసన వ్యక్తం చేశాడు.

ఎందుకు నిరాకరించారో రైటింగ్‌లో ఇవ్వాలని డిమాండ్

ఎందుకు నిరాకరించారో రైటింగ్‌లో ఇవ్వాలని డిమాండ్


అనంతరం హోటల్ సిబ్బంది చెప్పిన కారణాన్ని రైటింగ్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశాడు.చేసేదేమిలేక హోటల్ సిబ్బంది లుంగితో ఉండడంతో అనుమతించలేదని పేపర్ మీద రాసి ఇచ్చారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయిన కరీం మరుసటి రోజు పోలీసులకు పిర్యాధు చేశాడు. అనంతరం స్థానికులతో వచ్చి హోటల్ ముందు ధర్నా చేపట్టాడు.

లుంగీ కట్టుకుంటే అనుమతి లేదు

లుంగీ కట్టుకుంటే అనుమతి లేదు


అయితే కరీం చేసిన అరోపణలకు హోటల్ యజమాన్యం వివరణ ఇచ్చింది. కరీం అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడని హోటల్ నిబంధనల ప్రకారం లుంగీలు కట్టుకున్న వ్యక్తులను హోటల్‌లోకి అనుమతి లేదని చెప్పారు. మరోవైపు హోటల్‌లో రెండు విభాగాలు ఉన్నాయని రూఫ్ టాఫ్ ప్రాంతంలో ఫ్యామిలి సెక్షన్‌తో పాటు కొంతమంది మహిళలు కూడ ప్రత్యేకంగా వస్తారని అందుకే అనుమతించ లేదని వివరించారు.

ఇక మరో కరీం మైనారీటికి చెందిన వాడు కావడంతోనే హోటల్ సిబ్బంది అనుమతికి నిరాకరించారని స్థానికులు ఆరోపణలు చేశారు. దీంతో కరీం పిర్యాధుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని హోటల్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

English summary
Denied entry to the rooftop bar of a premium hotel, a group of men organised a protest outside the establishment in Kerala's Kozhikode on Wednesday. The protestors claimed that they were denied entry by Hotel Sea Queen because they were wearing a 'lungi' into the hotel's premium restaurant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X