వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరూ చూస్తుండగానే బజార్లో ఆమె బట్టలు విప్పేసింది, ఎందుకో తెలుసా ?

రద్దుచేసిన నగదును మార్పిడి చేసుకొనేందుకు వచ్చిన ఓ మహిళ తీవ్ర అసహనంతో ఆర్ బి ఐ బ్యాంకు ఎదుుటే బట్టలు విప్పేసి తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ ఘటన డిల్లీలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :రద్దుచేసిన నగదును మార్చుకొనేందుకు వచ్చిన ఓ మహిళ తీవ్ర అసహనానికి గురైంది. నోట్లు మార్పిడిచేసుకొనే గడువు ముగిసిందని అధికారులు చెప్పడంతో ఆమె వినలేదు. తన బట్టలను విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఆర్ బి ఐ కార్యాలయం ఎదుట చోటుచేసుకొంది.

నాలుగు వేల రూపాయాల పాత నగదు నోట్లను మార్పిడిచేసుకొనేందుకు రెండురోజులుగా ఆర్ బిఐ వద్దకు చేరుకొంది. రెండు రోజులుగా ఆర్ బి ఐ కార్యాలయం వద్దకు వచ్చినా ఆమె నోట్ల మార్పిడి కాలేదు. బుదవారం నాడు నోట్లు మార్చుకొనేందుకు ఆమె ఆర్ బి ఐ కార్యాలయం లోపలికి వెళ్ళింది.

రద్దుచేసిన నగదును మార్చుకోవడానికి గత ఏడాది నవంబర్ వరకే గడువు ముగిసిందని, బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిన గడువు కూడ తీరిపోయిందని ఆ మహిళకు అధికారులు చెప్పారు.

denied exchange of old notes, woman strips near rbi’s delhi office

ఇళ్ళల్లో పనిచేస్తూ జీవనం సాగించే ఆ మహిళన నాలుగువేల రూపాయాలను మార్పిడిచేసుకొనేందుకు వచ్చింది. తన నగదును మార్చి ఇవ్వాలని ఆమె కోరడంతో పోలీసులు ఆమెను బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.

పోలీసుల నుండి తప్పించుకొని ఆర్ బి ఐ గేటు ఎదుటే నిల్చొని అందరూ చూస్తుండగానే తన బట్టలను విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. చివరకు ఆమెకు పోలీసులు బట్టలు ఇచ్చారు. ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు కూడ లేదు. మరో వైపు ఆమె మార్చుకొనేందుకు తెచ్చిన రద్దుచేసిన నగదు కూడ చిరిగిపోయి ఎలుకలు కొరికి ఉన్నాయి. ఆమెకు డబ్బులు ఇవ్వకుండానే పంపించారు.

English summary
a woman allegedly stripped in front of a crowd outside RBI building in new Delhi on Wednesday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X