• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాగ్వార్ కారు కోనివ్వలేదని బీఎండబ్ల్యూను నదిలో తోసిన హర్యానా యువకుడు (వీడియో)

|
  జాగ్వార్ కారు కోనివ్వలేదని బీఎండబ్ల్యూను నదిలో తోసిన హర్యానా యువకుడు (వీడియో)

  చండీగఢ్ : పిల్లలు అడిగిందల్లా కొనిచ్చారో అంతే సంగతులు. ఎందుకంటారా వారు కోరింది మీరు ఇప్పిచ్చారనుకో మీకు బాధలు తప్పవు. పసిప్రాయంలో అయితే ఓకే .. కానీపెద్దయ్యాక మాత్రం తలపోటు తప్పదు. అచ్చం ఇలాంటి ఘటనే ఎదురైంది హర్యానా దంపతులకు. తమ కుమారుడి కోరాడని కారు కొనిచ్చారు. అయితే అతను చెప్పిన మోడల్ కాకపోవడంతో ఆగ్రహానికి గురైన యువకుడు పేరెంట్స్‌పై కోపం చూపించలేదు. తనకు బహుమతిగా ఇచ్చిన కారునే నదిలో పారేసి .. సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆ ఫీట్‌ను వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు.

  హర్యానాకు చెందిన ఓ పేరెంట్స్ తమ కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి గారాబం చేశారు. అడిగిందల్లా .. కోరిందల్లా కొనిచ్చారు. పెద్దయ్యాక కారు కొనియమని కోరితే .. కారు కూడా కొనిచ్చారు. అయితే అతను తనకు జాగ్వార్ కారు కొనియాలని కోరాడు. జాగ్వార్ కారు స్పోర్ట్స్ కారు కాబట్టి .. రేసుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేరెంట్స్ భావించారు. దానికన్నా బీఎండబ్య్లూ కారు మంచిదని భావించారు. అందులో హై ఎండ్ కారును కొని గిప్ట్ ఇచ్చారు. కానీ తాను అడిగిన మోడల్ కారు కొనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకేముంది తల్లిదండ్రులను ఏమనగా .. నోరులేని కారుపై తన ప్రతాపాన్ని చూపించాడు.

  Denied Jaguar, BMW push into river haryana youth

  ఇటీవల భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో యమునానగర్‌కు తన స్నేహితులతో చేరుకున్నాడు యువకుడు. నిండుకుండను తలపిస్తోన్న నది ప్రవాహంలో కారును తన స్నేహితులతో కలిసి తోశాడు. అంతేకాదు ఈ వైనాన్ని మొత్తం వీడియో కూడా తీశాడు. ఆ కారు నదిలో కొట్టుకుపోయి .. మధ్యలో ఆగిపోయింది. దాని చుట్టూ గడ్డి పేరుకుపోయింది. దీనిని అక్కడున్న స్థానిక యువకులు చూసి .. గజ ఈతగాళ్లకు సమాచారం అందించారు. వారికి యువకులు కూడా సహకారం అందించి కారును బయటకి వెలికితీశారు. తర్వాత నదిలో కారు కొట్టుకుపోతుంటే బయటకు తీశామని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్టు స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Gifted a BMW by his parents instead of a Jaguar that he was demanding, a youth from Haryana’s Yamunanagar on Friday pushed his new car into a swollen river in a fit of anger, police said. “When the youth was plunging the high-end BMW car into the river, he also made a video and put it on social media,” a police official told IANS. The car later got stuck in the middle of the river owing to a patch of tall grass. Later, the youth was seen trying to get the car out of the river with the help of local divers. Police have registered a case in the matter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more