వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో పొగమంచు: 70 రైళ్లు రద్దు, 30 విమానాలు ఆలస్యం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా రవాణా వ్యవస్ధ పూర్తిగా స్తంభించింది. పొగమంచు కారణంగా వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

కాగా, పొగమంచు దట్టంగా అలముకోవడంతో కాంతి మందగించి రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 70 రైళ్లు వరకు రద్దయ్యాయి. ఢిల్లీకి రావాల్సిన 57 రైళ్లు ఆలస్యంగా రానున్నాయి. పొగమంచు కారణంగా 30 విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది.

Dense fog disrupts train services, 70 cancelled

పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎనిమిది రైళ్లను రీషెడ్యూల్ చేశామని ఉత్తర రైల్వే అధికారులు ప్రకటించారు. మంగళవారం 60 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా... 40 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. 12 రైళ్లను అధికారులు రద్దు చేశారు.

విజిబిలిటీ 150 మీటర్లకు పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం 8.30 గంటలకు తేమ 97 శాతం ఉందని వెల్లడించింది. ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 16.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. తీవ్రమైన పొగమంచుతో ప్రజలు అల్లాడుతున్నారు. చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.

ఉత్తర రైల్వే రద్దు చేసిన రైళ్ల వివరాలు:

Dense fog disrupts train services, 70 cancelled
Dense fog disrupts train services, 70 cancelled
Dense fog disrupts train services, 70 cancelled
English summary
Dense fog disrupted train services in several parts of India on Wednesday, leading to the cancellation of at least 70 trains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X