వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: నల్లధనం వివరాలను ఈలోపుగా ఇవ్వాల్సిందే, లేదంటే?

నల్లధనం కలిగి ఉన్నవారంతా ఈ నెల 31వ, తేదిలోపుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పీఎంజీకెవై) పథకం కింద తమ వివరాలను వెల్లడించాలని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:నల్లధనం కలిగి ఉన్నవారంతా ఈ నెల 31వ, తేదిలోపుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పీఎంజీకెవై) పథకం కింద తమ వివరాలను వెల్లడించాలని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త పథకాలను తీసుకువచ్చింది. ఈ మేరకు పెద్ద నగదు నోట్లను కూడ కేంద్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.

గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.మరో వైపు నల్లధనం ఉన్నవారు తమ వివరాలను స్వచ్చంధంగా వెల్లడించేందుకు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది.

నల్లధనం కలిగి ఉన్నవారంతా ఈ మార్చి 31వ, తేదిలోపుగా తమ వివరాలను ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మార్చి 31 వరకు నల్లధనం వివరాలు వెల్లడించాల్సిందే

మార్చి 31 వరకు నల్లధనం వివరాలు వెల్లడించాల్సిందే

ఈ ఏడాది మార్చి 31వ, తేదిలోపుగా నల్లధనం వివరాలను వెల్లడించాల్సిందేనని ఆదాయపుపన్నుశాఖ అధికారులు హెచ్చరించారు.నల్లధనం వివరాలను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఈ నెలాఖరువరకు ఇవ్వాల్సిందేనని ఐటిశాఖ హెచ్చరికలు జారీ చేసింది. డెడ్ లైన్ కు కౌంట్ డౌన్ ను ప్రారంభించినట్టు ఆదాయపుపన్నుశాఖ ప్రకటించింది.ఈ గడువులోపుగా బ్లాక్ మనీ వివరాలు వెల్లడించాలని కోరింది.లేకపోతే కఠినచర్యలు తీసుకోవాలని ఆదాయపుపన్నుశాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నెలాఖరువరకు వివరాలు వెల్లడించకపోతే బినామీ చట్టం కింద కఠినచర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఐటిశాఖ హెచ్చరించింది.

భారీ జరిమానాలు విధిస్తామని ఐటీ శాఖ హెచ్చరిక

భారీ జరిమానాలు విధిస్తామని ఐటీ శాఖ హెచ్చరిక

డిఫాల్టర్ల పేర్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సిబీఐ లాంటి కేంద్ర విచారణ సంస్థలకు అప్పగిస్తామని ఆదాయపున్ను శాఖ ప్రకటించింది.పిఎంజీకెవైను సద్వినియోగం చేసుకోలేని వారు నగదును డిపాజిట్లను 137 శాతం కంటే ఎక్కువ పన్ను జరిమానాలే ఉంటాయని సీనియర్ అధికారి చెప్పారు.డిఫాల్టర్లకు వ్యతిరేకంగా బినామీ చట్టాలను ప్రయోగిస్తామని ఐటి శాఖ హెచ్చరించింది.

ఐటి రిటర్న్స్ లో నల్లధనం వివరాలు చెబితే జరిమానా 77 శాతం

ఐటి రిటర్న్స్ లో నల్లధనం వివరాలు చెబితే జరిమానా 77 శాతం

నల్లధనం కలిగి ఉన్నవారు తమ వివరాలను స్వచ్చంధంగా వివరాలను వెల్లడించాలని కోరింది.అయితే ఈ వివరాలను తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది.నల్లధనం కలిగి ఉన్న వారు ఐటి రిటర్న్స్ లో వాటి వివరాలను చెబితే 77.25 శాతం జరిమానాను విధిస్తామని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది.

నల్లధనం సరెండర్ చేయకపోతే 107.25 శాతం జరిమానా

నల్లధనం సరెండర్ చేయకపోతే 107.25 శాతం జరిమానా

ఆదాయపు పన్నుశాఖ తనిఖీల సమయంలో లెక్కలు చూపని ఆదాయం ఉన్నట్టు అంగీకరించడంతో పాటు దానికి సంబంధించి సరైన వివరణ ఇచ్చిన పక్షంలో 107.25 శాతం పన్నులు జరిమానా ఉంటుందని చెప్పారు.అయితే తనిఖీల్లో దొరికిన నల్లధనాన్ని సరెండర్ చేయని వారకి ఏకంగా 137.25 శాతం పన్ను విధించనున్నట్టు ఐటి శాఖ ప్రకటించింది.

English summary
The Income Tax department on Friday warned black money holders that their time to deposit illegal wealth under the Pradhan Mantri Garib Kalyan Yojna was running out. In advertisements in leading dailies, the IT department reminded black money holders that it had information about their illegal deposits and higher penalties would be levied on those who do not avail the PMGKY before the March 31 deadline and declare their illegal assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X