వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'లెక్క' చెప్తే 50%, లేదంటే 90% పన్ను, మీ డబ్బు 4ఏళ్లకు: జన్ ధన్‌లో కళ్లు తిరిగే డిపాజిట్లు!

జన్‌ ధన్‌ యోజన ఖాతాల్లో డిపాజిట్లు నవంబర్‌ 16 నాటికి రూ.64,252 కోట్లకు పైగా చేరుకున్నాయని కేంద్రం తెలిపింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రద్దు రూ.500, రూ.1000 నోట్లతో డిసెంబర్‌ 30 వరకూ చేసే బ్యాంకు డిపాజిట్లలో లెక్కలు చెప్పని డబ్బు పైన కనిష్ఠంగా 50% పన్ను విధించే అవకాశముంది. అంతేకాదు, మిగతా సగంలో మరో సగాన్ని నాలుగేళ్ల కాలం పాటు బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయకుండా ఆంక్షలు విధించనుంది.

మరో ఛాన్స్, దెబ్బకు దెబ్బ: బ్యాంకులో లెక్కలేని డబ్బుపై మోడీ కొరడామరో ఛాన్స్, దెబ్బకు దెబ్బ: బ్యాంకులో లెక్కలేని డబ్బుపై మోడీ కొరడా

లెక్కలు చూపని డబ్బును స్వచ్ఛందంగా ప్రకటించకుండా, ఆదాయ పన్ను అధికారులే గుర్తిస్తే మాత్రం 90 శాతం వరకూ పన్ను, జరిమానాను పడే అవకాశముంది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టాన్ని కేంద్రం సవరించనుంది. దీనికి కేబినెట్ గురువారం రాత్రి ఆమోదం తెలిపింది.

demonetisation

జన్ ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు

జన్‌ ధన్‌ యోజన ఖాతాల్లో డిపాజిట్లు నవంబర్‌ 16 నాటికి రూ.64,252 కోట్లకు పైగా చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. యూపీ రూ.10,670.62 కోట్లతో జాబితాలో మొదటి స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

యూపీలో 3.79 కోట్ల అకౌంట్ హోల్డర్లు ఉండగా, పశ్చిమ బెంగాల్లో 2.44 కోట్ల అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. రాజస్థాన్‌లో 5,345 కోట్లు జమ అయ్యాయి. బీహార్‌లో 4,912 కోట్లు జమ అయ్యాయి. ఇవి నవంబర్ 16వ రకు జమ అయిన మొత్తం. జీరో బ్యాలెన్స్ నిల్వ కలిగిన జన్ ధన్‌ ఖతాల్లో రూ.1, రూ.2 జమ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించలేదని తెలిపింది.

English summary
The Centre also stressed that no public sector banks had given any instructions to their officials to deposit Re 1 or 2 to avoid zero balance in Jan Dhan accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X