వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరేబియా సముద్రంలో వాయుగుండం.. రెండు రోజులు భారీ వర్షాలు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మండుటెండలో మంచుపూల వర్షం అంటే ఇదేనేమో! వేసవికాలంలో చల్లటి వాయుగుండం ఏర్పడింది. దక్షిణ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రభావం వల్ల రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు తోడు పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

అయితే, తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం మాత్రం ఏమీ ఉండబోదు. దక్షిణ కేరళపైనే వాయుగుండం ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం నాటికి దక్షిణ శ్రీలంక, మాల్దీవులు-కమొరిన్‌కు ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా పరిణామం చెందిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఆ వాయుగుండం మంగళవారం ఉదయం 8.30 గంటలకు అరేబియా సముద్రం నైరుతీ తీరాన తిరువనంతపురానికి 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే ప్రమాదముందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చిరించింది.

 Depression over southeast Arabian sea, Kerala’s southern coast warned of heavy rains

ఆ వాయుగుండం రాబోయే రోజుల్లో తమిళనాడు తీరాన్ని తాకే ప్రమాదముందని హెచ్చరించింది. సముద్రం ఉగ్రరూపం దాల్చే ప్రమాదముందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. గత ఏడాది వచ్చిన ఓఖీ తుఫాను నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఓఖీ తుఫానుపై ముందే హెచ్చరించినా సరైన చర్యలు తీసుకోవడంలో కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మరి ఈసారైనా కేరళ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

English summary
The Indian Meteorological Department (IMD) in its latest weather bulletin has warned of heavy rain, thundershowers and squally winds in southern Kerala over the next 48 hours due to the formation of a depression over the southeast Arabian Sea. “Yesterday’s well-marked low-pressure area over Equatorial Indian Ocean and adjoining south Sri Lanka and Maldives-Comorin area concentrated into a depression and lay centred at 0830 IST of today, the 13th March 2018, over the southeast Arabian Sea adjoining Equatorial Indian Ocean near latitude 5.00N and longitude 76.00E, about 480 km southeast of Minicoy, 390 km south-southwest of Thiruvananthapuram and 290 km east-northeast of Male (the Maldives),” the IMD bulletin issued at noon today said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X