వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు డిప్యూటీ సీఎం ఆందోళన .. రైతులకు అండగా ఉండటం నేరమా .. బీజేపీపై ఫైర్

|
Google Oneindia TeluguNews

దేశ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక సీఎం కోసం డిప్యూటీ సీఎం ఆందోళనకు దిగటం యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది . ఏకంగా ఒక సీఎం నే అందులోనూ దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గృహ నిర్బంధంలో ఉంచారన్న వార్తలు ఉదయం నుండి హల్చల్ చేస్తున్నాయి. ఒక పక్క రైతుల ఆందోళనలతో భారత్ బంద్ కొనసాగిన వేళ సీఎం కేజ్రీవాల్ నిర్బంధం , ఆపై డిప్యూటీ సీఎం సీఎం కోసం ఆందోళన చెయ్యటం ఆసక్తికరంగా మారాయి.

మా రైతులు ఆహార సైనికులు .. రైతులకు మద్దతుగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విజ్ఞప్తి మా రైతులు ఆహార సైనికులు .. రైతులకు మద్దతుగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విజ్ఞప్తి

 సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు డిప్యూటీ సీఎం నిరసన

సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు డిప్యూటీ సీఎం నిరసన

సింఘూ సరిహద్దు వద్ద సోమవారం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో భేటీ అయినప్పటి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గృహ నిర్బంధంలో ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ఆరోపించింది. ఈ నేపధ్యంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరియు ఇతర ఆప్ నేతలు కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగారు . అయితే ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఆ వ్యాఖ్యలను ఖండించారు.

సీఎం కేజ్రీవాల్ ను గృహ నిర్బంధంలో ఉంచారని ఆప్ నేతల ఆరోపణ

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, పోలీసుల ద్వారా సిఎం అరవింద్ కేజ్రీవాల్ ని నిన్న సింఘూ బోర్డర్ వద్ద రైతులను సందర్శించినప్పటి నుండి గృహ నిర్బంధంలో ఉంచారని ఆప్ ఉదయం ఒక ట్వీట్ లో తెలిపింది. ఆయన నివాసంలోకి వెళ్ళడానికి అనుమతి లేదని పేర్కొంది . కేజ్రీవాల్ నివాసం వెలుపల పోలీసులను చూపించే వీడియోను పార్టీ ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి నివాసాన్నిదిగ్బంధించారని పార్టీ ఆరోపించింది.

ఉప ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతించరా ?

ఉప ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతించరా ?


కేజ్రీవాల్ రైతులకు మద్దతు ఇచ్చిన కారణంగా బిజెపి కోపంగా ఉందని ఆప్ నేతలు పేర్కొన్నారు . కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేజ్రీవాల్ ను కలవడానికి తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతించడం లేదు మరియు అమిత్ షా పోలీసులు గృహ నిర్బంధం లేరని చెబుతున్నారు? అని సిసోడియా ట్వీట్ చేశారు. మన దేశ రైతులతో నిలబడటం ఇంత పెద్ద నేరమా? అని ప్రశ్నించారు .

స్టేడియం లను జైళ్ళుగా మార్చనందుకే సీఎం ఇంటినే జైలు చేశారా ?

స్టేడియం లను జైళ్ళుగా మార్చనందుకే సీఎం ఇంటినే జైలు చేశారా ?

ఢిల్లీ లోని స్టేడియాలను రైతుల కోసం జైళ్లుగా మార్చడానికి తాను నిరాకరించడంతో కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపిని జైళ్ళు ఏర్పాటు చెయ్యకుండా అడ్డుకున్నారు, కాబట్టి వారు కేజ్రీవాల్ ఇంటిని జైలుగా మార్చారు. సామాన్యులు గాని, మంత్రులు గానీ ఆయనను కలవలేరు అంటూ ఆరోపించారు . సిసోడియా, ఆప్ నాయకులు సీఎం కేజ్రీవాల్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.

ఆప్ ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారన్న సౌరభ్ భరద్వాజ్

ఆప్ ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారన్న సౌరభ్ భరద్వాజ్

ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సోమవారం కేజ్రీవాల్‌ను కలవడానికి వెళ్లినప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారన్నారు . దేశవ్యాప్తంగా సమ్మెకు కేజ్రీవాల్ మద్దతు ఇవ్వడం పట్ల కేంద్రం ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు. భారత్ బంద్ రోజున ఢిల్లీ ముఖ్యమంత్రి రైతులకు మద్దతు ఇవ్వడానికి వెళితే, బీజేపీ యొక్క అబద్ధాలు మరియు తప్పుడు హామీలు బహిర్గతమవుతాయని కేంద్రం భయపడుతోంది" అని ఆయన అన్నారు.

 ఆరోపణలను ఖండించిన పోలీసులు .. రాజకీయ వర్గాల్లో చర్చ

ఆరోపణలను ఖండించిన పోలీసులు .. రాజకీయ వర్గాల్లో చర్చ

అయితే తాము సీఎం కేజ్రీవాల్ ను నిర్బంధించలేదని , కేవలం భద్రత కోసమే కేజ్రీవాల్ నివాసంబయట పోలీసుల మోహరింపు అని చెప్పారు . ఇది ఒక సాధారణ ప్రక్రియ అని మేము ముఖ్యమంత్రి నివాసంతో సమన్వయం చేస్తున్నాము. ఎవరైనా లోపలికి అనుమతించాలని వారు చెబితే, మేము అనుమతిస్తాము అని పోలీసులు పేర్కొంటున్నారు . కానీ పోలీసుల వాదనకు భిన్నంగా సీఎం కోసం డిప్యూటీ సీఎం ఆందోళన బాట పట్టటం నిజంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

English summary
The Aam Aadmi Party on Tuesday alleged that Delhi Chief Minister Arvind Kejriwal has been under house arrest since his meeting with the farmers protesting against the Centre’s agricultural laws at the Singhu border on Monday. Delhi Deputy Chief Minister Manish Sisodia and several other AAP members began a protest outside Kejriwal’s residence later in the day.The Delhi Police, however, have denied placing any restrictions on the chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X