వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ రాకెట్: ఇద్దరు గర్ల్స్‌తో దొరికిన డిప్యూటీ మేయర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 deputy mayor held with two call girls
పాట్నా: వ్యభిచారం చేస్తూ ఓ డిప్యూటీ మేయర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా పోలీసుల కథనం ప్రకారం... పాట్నా నగరంలోని అత్యంత ఖరీదైన హైటల్‌లో గత అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీలలో గయా నగర డిప్యూటీ మేయర్‌తోపాటు ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.

డిప్యూటీ మేయర్, ఇద్దరు అమ్మాయిలతో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని కోత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. వారిని విచారిస్తున్నామన్నారు. పాట్నా నగరంలోని అత్యంత ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందని తమకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.

డిప్యూటీ మేయర్‌ను, ఆయనతో ఉన్న ఇద్దరిని తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. గయ నగరం పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డిప్యూటీ మేయర్ సెక్స్ రాకెట్ల‌ో పట్టుబడటం గమనార్హం.

గత నెల గయ పోలీసులు హెయిర్ కట్టింగ్ పార్లర్ పేరుతో నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. అప్పుడు సెక్స్ రాకెట్ రట్టయిన ప్రాంతం ఈ డిప్యూటీ మేయర్‌కు చెందిన స్థలంలోనే అంటున్నారు. అప్పుడు ఈ సెక్స్ రాకెట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అతను కొట్టిపారేశాడు.

English summary
The deputy mayor was held with two call girls from a hotel room, the police said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X